Upendra Gadi Adda Review: A good message for today’s youth stuck in social media (Rating:3.0)

మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు యూత్ లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యే యువ హీరోలకు ఈ జోనర్ ను ఎంచుకుని సినిమాలను తెరకెక్కిస్తారు. తాజాగా యువ హీరో కంచర్ల ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ కూడా ఇలాంటి మాస్ ఎంటర్టైనరే. ఇందులో అతనికి జోడీగా సావిత్రి కృష్ణ నటించారు. ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ఉపేంద్ర(కంచర్ల ఉపేంద్ర) బంజారాహిల్స్ ని ఓ బస్తీ కుర్రాడు. డిగ్రీ వరకూ చదువుకున్నా... ఈజీగా మనీ సంపాధించి సెటిల్ అయిపోవాలనునుకునే కుర్రాడు. అందుకోసం ఓ ధనవంతురాలిని పెళ్లి చేసుకోవాలని అప్పులు చేసి... పబ్ ల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సావిత్రి(సావిత్రి కృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె గొప్పింటి అమ్మాయి అనుకుని... తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి... ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే తన గురించి ఆమెకు నిజం చెప్పాలని అనుకుని... తాను ధనవంతుడిని కాదని... బంజారాహిల్స్ లో ఓ బస్తీ కుర్రాడిని అని చెబుతాడు. మరి ఆ బస్తీ కుర్రాడిని... సావిత్రి పెళ్లి చేసుకుందా? అసలు సావిత్రి ఎవరు? వీరిద్దరికీ పెళ్లి అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే... యువతను ఆకట్టుకునే మాస్ ఎంటర్టైన్ మెంట్ అంశాలు ఉంటూనే... వాటికి సందేశాన్ని కూడా జోడించి ఆడియన్స్ కి చెబితే... బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా యూత్ కి, వారి తల్లిదండ్రులకు ఇచ్చారు. నేడు సోషల్ మీడియా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో... దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మాయిలు సోషియల్ మీడియా ప్రభావంతో తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే దానిని చాలా బాగా చూపించారు. సోషియల్ మీడియాలో అబ్బాయిలు... అమ్మాయిలను ఎలా మోసం చేసి... చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు? దాని వల్ల వారు చేసే క్రైం ని ద్వితీయార్థంలో దర్శకుడు చక్కగా చూపించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లల జీవితాలను ఎంత ప్రమాదంలోకి నెడుతోందనేదాన్ని చూపించారు వారి తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా చూపించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్లతో సరదా సన్నివేశాలను చూపించి... సెకెండాఫ్ లో ఓ మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’.

కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడైనా చాలా చక్కగా నటించారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి... మాస్ ను ఆకట్టుకున్నాడు. ఓ బస్తీ కుర్రాడు ఎలా ఉంటారో అలాంటి మాస్ లుక్ తోనూ... మరో వైపు రిచ్ కిడ్ గానూ రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు. ఈ సినిమాలో మంచి నటన కనబరచినందేకే అనుకుంటా... తన తండ్రి, ఈ చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు అతనితో ఐదు సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ కూడా త్వరలో నెలకొకటి చొప్పున రిలీజ్ చేయడానికి ప్లాను చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఉపేంద్రకు జోడీగా నటించిన సావిత్రి కృష్ణ కూడా బాగా చేసింది. బాధ్యత గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ కూడా బాగా నవ్వించారు. అలాగే జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు కాసేపు ఉన్నా నవ్వించారు. బలగం మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. సోషియల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... అమ్మాయిలను మోసం చేసే పాత్రలో కిరీటి దామరాజు పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా సంధ్య జనక్, బస్ స్టాప్ కోటేశ్వరరావు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు రాసుకున్న కథ... కథనం బాగుంది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఓ కొత్త హీరోను ఎన్ని యాంగిల్స్ లో చూపించాలో అన్ని రకాలుగానూ హీరో పాత్రను తీర్చిదిద్దారు. అలాగే సోషియల్ మీడియా ప్రభావంతో యువతులు ఎలా మోసపోతున్నారనే దాన్ని ఓ మెసేజ్ రూపంలో ఇవ్వాలనే థాట్ ని దర్శకుడు బాగా ఇంప్లిమెంట్ చేశారు. సంగీతం మాస్ ను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. హీరో, హీరోయిన్లను బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో ఉన్నతంగా నిర్మించారు. నిర్మాణ విలువల చాలా బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.