Social News XYZ     

#MenToo Movie Review: A fun take on Men’s pain (Rating:

#MenToo Movie Review: A fun take on Men's pain (Rating:

నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు
ఛాయాగ్రహణం : పీసీ మౌళి
సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
నిర్మాత : మౌర్య సిద్ధవరం
రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి
విడుదల తేదీ: మే 26, 2023రేటింగ్: 3.25

ఇటీవల టీజర్, ట్రైలర్లతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన సినిమా ... #MenToo. ఇందులో నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రధారులు పోషించారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి.

 

కథ: ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను... కష్టనష్టాలను ఒకరితోనొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా సెక్స్ వల్ హరాష్ మెంట్ తో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకోలేకపోవడం తదితర సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ.

కథ... కథనం విశ్లేషణ: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ కి మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... హరాష్ మెంట్ గురై బాధపడేది... అబ్బాయిలు కూడా అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాలను బేస్ చేసుకుని... కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మలిచారు దర్శకుడు. గ్రిప్పింగ్ కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్ గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. మొదటి హాఫ్ లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్ గా నడిపించి... ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్ లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్ గా తెరమీదకెక్కించారు దర్శకుడు. ఇలా... మెన్ కూడా అమ్మాయిలలాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు... వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యతం అలరిస్తుంది.
ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త ఫెరొషియస్ గా కనిపించి మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్ లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

దర్శకుడు రాసుకున్న కథ... కథనాలు గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సంగీతం పర్వాలేదు. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

Facebook Comments
#MenToo Movie Review: A fun take on Men's pain (Rating:

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: