ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ గాలోడు ఫస్ట్ సింగిల్ నీ కళ్లే దివాళి
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం గాలోడు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గాలోడు టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో 13 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరికల్ సాంగ్‌పై మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా నీ కళ్లే దివాళి... లిరికల్ వీడియోసాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్వరపరిచిన ఈ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో సుధీర్ డ్యాన్స్, ఫారెన్ లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ```గాలోడుఫస్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడునీ కళ్లే దివాళిపాట కూడా ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. శ్రీనివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చక్కగా ఆలపించాడు. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందినగాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్తయ్యింది. ఫస్ట్ సాంగ్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. త్వరలోనే విడుదల తేధిని ప్రకటిస్తాం`` అన్నారు.
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: సి రాం ప్రసాద్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడక్షన్ కంట్రోలర్: బిక్షపతి తుమ్మల
సమర్పణ: ప్రకృతి
బేనర్: సంస్కృతి ఫిలింస్,
రచన - దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
https://www.youtube.com/watch?v=LSrq4MJmCOg

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.