Friendship Song from Ginna movie is Song by Ariaana & Viviana Manchu is composed Anup Rubens

"జిన్నా" చిత్రంలో అనూప్ స్వరపరచిన స్నేహం మీద సాగే పాట ద్వారా సింగర్స్ గా పరిచమైన అరియనా, వివియనా

సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అని అంటారు.అనూప్ మ్యూజిక్ హిస్టరీకి ఒక ప్రత్యేక శైలి, స్థానం ఉన్నాయి. ఫాస్ట్ బీట్, మెలొడీ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్, పేట్రియాటిక్, ఫోక్ సాంగ్స్..ఇలా పాటల కంపోజిషన్ లో అనూప్ టచ్ చేయని జానర్ లేదు, మెప్పించని తరహా లేదు. అప్పట్లో క్యాసెట్ల అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్లు చూసిన అనూప్..డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించి మారిన ట్రెండ్ లోనూ మారని తన మ్యూజిక్ టాలెంట్ ను చూపిస్తున్నారు. "జై" సినిమాతో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం పద్దెనిమిదేళ్లుగా తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో కొనసాగుతూ అటు స్టార్ కథానాయకుల చిత్రాలకు ఇటు నవతరం సినిమాలకు స్వరాలు అందిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు అనూప్ రూబెన్స్.

జై, ధైర్యం నుంచి మొదలైన అనూప్ రూబెన్స్ కెరీర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమకావాలి’ చిత్రం ద్వారా మరో మలుపు తీసుకుంది.ఈ సినిమాతోనే ఆది సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యాడు.ఈ చిత్ర విజయంతో అనూప్ పై ఎంతోమంది పేరున్న దర్శక, నిర్మాతలు తమ చిత్రాలకు సంగీతం చేసేందుకు ఎర్రతివాచీ పరచి ఆయనను ఆహ్వానించారు. ఇష్క్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ తన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ కు కూడా అనూప్ నే ఎంచుకున్నారు.

ఆ తరువాత లవ్ లీ, సునీల్ పూలరంగడు భీమవరం బుల్లోడు,నటసింహ నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్తరీ వెంకటేష్ లు నటించిన గోపాల గోపాల…మళ్ళీ పవర్ స్టార్ తో కాటమరాయుడు, అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’, రానా ‘నేనే రాజు- నేనే మంత్రి’ వంటి జనరంజక చిత్రాలకు అనూప్ రూబెన్స్ బాణీలు దన్నుగా నిలిచాయి. ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో కింగ్ అక్కినేని నాగార్జున ‘మనం’కు స్వరకల్పన చేసే అవకాశం అనూప్ కు ఇచ్చారు .కింగ్ అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల స్టార్ హీరోస్ నటించిన ఏకైక చిత్రం ‘మనం’కు సంగీతం సమకూర్చడం నిజంగా అనూప్ కు లభించిన అదృష్టమనే చెప్పాలి. హార్ట్ ఎటాక్, పిల్లా నువ్వు లేని జీవితం,యంగ్ టైగర్ చిత్రం టెంపర్, 90 Ml, హెలో, అఖిల్, సీత, మహానుభావుడు, మంచి రోజులు వచ్చాయి, విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 చిత్రాలు వరుసగా విజయం సాధించడం తో అనూప్ బాణీలకూ జనం జేజేలు పలికారు.

అనూప్ నేపద్య సంగీతంమూ ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా ఉంటుంది. ప్రతి పాటకీ చాలా తక్కువగా పాశ్చాత్య వాయిద్య పరికరాలను వినియోగిస్తూ చాలా సహజమైన వాయిద్యాలతో సంగీతం అందించే ప్రయత్నం చేస్తూ అచ్చు స్వచ్ఛమైన పల్లెటూరి అనుభూతిని కలిగిస్తుంటాడు అనూప్. "30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?" చిత్రంలోని నీలి నీలి ఆకాశం 274 మిలియన్ వ్యూస్ సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. "మనం" తర్వాత నటనిర్మాత నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుతూ "సోగ్గాడే చిన్ని నాయనా" వంటి క్లాస్ హిట్స్ ఇవ్వడం అనూప్ కే సాధ్యమైంది. దీని సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు చిత్రాన్ని కూడా మ్యూజికల్ హిట్ గానూ మలిచారు అనూప్.ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్, జీవిత ల సినిమా "శేఖర్" చిత్రం లోని పాటలు సైతం ప్రేక్షకుల మదిని దోచాయి. డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" కు అనూప్ స్వరాలు సమాకూర్చాడు.

ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానాలు సింగర్స్ గా పరిచయం అవుతుండడం విశేషం. తన కూతుళ్లు ఆలపించిన స్నేహం మీద సాగే ఈ పాటను మంచు విష్ణు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించడమే కాక ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉంది. సామాజిక అనుసంధాన వేదిక ప్రభావం మొదలయ్యాక సినిమా సంగీతం ఒక కొత్త ట్రెండ్ ను చూస్తుంది. ఒక్కొక్క పాట ఒక్కొక్కసారి విడుదల అవుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది.ఈ ట్రెండ్ మంచి పరిణామం.ఇది వరకు సి. డీ లు పెట్టుకొని మొత్తం పాటలు వినేవారు. ఇప్పుడు ఒక్కొక్క పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ అశ్వాదిస్తున్నాము. ప్రతి పాట శ్రోతల్ని ఎదో సందర్భంలో సృశిస్తూ సినిమాను చూడాలనే ఆసక్తి పెంచడంలో ఇటీవల పాటలు కీలక పాత్ర పోసిస్తాయని చెప్పచ్చు.

ఇప్పుడున్న ట్రెండ్ లో పాటలు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ ఎంతో ప్రజాధరణ పొందుతున్నాయి. ప్రస్తుతం డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు జనం ముందుకు రావలసి ఉన్నాయి. ఇప్పటికీ తన దరికి వచ్చిన చిత్రాలకు న్యాయం చేయాలనే పరి తపిస్తుంటారు అనూప్. భవిష్యత్ లోనూ తన బాణీలతో సంగీత ప్రియుల్ని అనూప్ మురిపిస్తూనే ఉంటారని ఆశిద్దాం.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.