Gandharwa Movie Review: Gandharwa… Nothing Special (Rating: 2.5)

Film: Gandharwa

Director: Apsar

Starring: Sandeep Madhav, Gayathri R Suresh, Sai Kumar, Senior Actor Suresh, Babu Mohan Etc..

Reviewer: Vadde Marenna

Rating: 2.5

వంగ‌వీటి, జార్జిరెడ్డి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ మాధ‌వ్.. ఙ‌ప్పుడు గంధ‌ర్వ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అత‌నికి జంట‌గా గాయ‌త్రి ఆర్.సురేష్ న‌టించింది. సాయికుమార్, సీనియ‌ర్ న‌టుడు సురేష్, బాబూ మోహ‌న్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మించారు. అప్స‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని అబ్దుల్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రంతోనూ సందీప్ మాధ‌వ్ ప్రేక్ష‌కుల్ని ఏమాత్రం ఆక‌ట్టుకున్నాడో చూద్దాం ప‌దండి.

క‌థః అవినాష్(సందీప్ మాధ‌వ్) ఓ మిలిట‌రీ అధికారి. పెళ్లైన మ‌రుస‌టి రోజే పాకిస్థాన్ తో యుద్ధం రావ‌డంతో... డ్యూటీలో జాయిన్ కావాల‌ని మిలిటరీ నుంచి క‌బురు వ‌స్తుంది. దాంతో యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లి.. అక్క‌డ వీర మ‌ర‌ణం పొందుతుతాడు. క‌ట్ చేస్తే... ఓ యాభై ఏళ్ల త‌రువాత త‌న సేమ్ ఏజ్ తో సందీప్ బ‌తికి త‌న సొంతూరు అయిన వైజాగ్ కి వ‌స్తాడు. అక్క‌డ త‌న స్నేహితులు, భార్య అంద‌రూ వ‌య‌సు మ‌ళ్లిన ముస‌లాళ్లుగా వుంటారు. వారిని అవినాష్... గుర్తిప‌ట్టి ప‌ల‌కిరించ‌గా ఎవ‌రూ అవినాష్ ని న‌మ్మ‌రు. చ‌నిపోయిన వ్య‌క్తి ఎలా తిరిగి వ‌స్తారని వాళ్ల‌కు న‌మ్మ బుద్ధి కాదు. అలానే త‌న భార్య అమూల్య‌(గాయిత్రి ఆర్.సురేష్) కూడా 68 ఏళ్ల వ‌య‌సొచ్చి ముదుస‌లి అయింటుంది. వీరికి ప్ర‌ముఖ పొలిటీషియ‌న్ విజ‌య్ భాస్క‌ర్(సాయికుమార్) సంతానం. వీరెవ‌రూ... అవినాష్ ని త‌మ‌ కుటుంబ స‌భ్యునిగా అంగీక‌రించ‌డానికి ఒప్పుకోరు. మ‌రి అవినాష్... వారిని ఒప్పించ‌డానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అవినాష్ వ‌య‌సు 28లోనే ఎందుకు ఆగిపోయింది? అస‌లు యుద్దంలో ఏం జ‌రిగింది? త‌దిత‌ర వివ‌రాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

క‌థ‌... క‌థ‌నం విశ్లేష‌ణః ద‌ర్శ‌కుడు ఎంచుకున్న ప్లాట్ బాగుంది. గ‌తంలో ఇలాంటి క‌థ‌... ఓ ప్రముఖ దిన ప‌త్రిక వీక్లీలో ఎన్.ఆర్.నంది రాసిన సిగ్గు సిగ్గు క‌థ‌ను పోలి వుంది. అందులో హీరో జ‌లియ‌న్ వాలాబాగ్ కాల్పుల్లో మెయిన్ పాత్ర త‌ప్పిపోయి... 50 ఏళ్ల త‌రువాత ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. గంధ‌ర్వ‌లో కూడా అచ్చం అలాగే ఇండో-పాక్ యుద్ధంలో త‌ప్పిపోయి... మ‌ళ్లీ యాభై ఏళ్ల‌కు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. న‌వ‌ల‌లోని మెయిన్ ప్లాట్ ను తీసుకుని... కొంచెం స్క్రీన్ ప్లే మార్చి.. ఈ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా తెర‌పై పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా మ‌లిచారు. అయితే స్లో అండ్ ఫ్లాట్ నెరేష‌న్ కార‌ణంగా సినిమా ఎక్క‌డా ప్రేక్ష‌కుడిని ఎగ్జైట్ మెంట్ కు గురిచేయదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో కొంచెం క్యూరియాసిటీ పెంచినా... 68 ఏళ్ళ భామ‌తో... 28 ఏళ్ల కుర్రాడి రొమాన్స్ ఆడియ‌న్స్ కి ఏమాత్రం డైజెస్ట్ కాదు. హీరోయిన్ కి వేసిన ముస‌లి మేక‌ప్ కూడా ఎబ్బెట్టుగా వుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ సీన్లు ఎక్క‌డా ఆక‌ట్టుకోవు... య‌వ్వ‌నంలో వుండ‌గా హీరోయిన్ తో శోభ‌నం సీన్ త‌ప్ప‌. పాయింట్ మంచిదే కానీ... దానికి మ‌రో కోణంలో స్క్రీన్ ప్లే రాసుకుని... క‌థ‌ను న‌డిపించి వుంటే సినిమా నెక్ట్స్ లెవెల్ వుండేది. ద్వితీయార్థంలో హీరోయిన్, హీరో మీద కొంత ఫోక‌స్ త‌గ్గించి... సాయి కుమార్, సీనియ‌ర్ హీరో సురేష్ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ను మ‌రింత హీట్ పెంచేలా స్క్రీన్ వుండి వుంటే ప్రేక్ష‌కులు బాగానే ఎంగేజ్ అయ్యేవారు. చివ‌ర్లో హీరో యాభై ఏళ్లు అయినా ఎందుకు యంగ్ గా వున్నార‌నే పాయింట్ ను కొంత ఖ‌గోళ శాస్త్రానికి లింక్ పెట్టి క‌న్విన్సింగ్ గా చెప్ప‌డానికి చేసిన ప్ర‌య‌త్నానికి ఆడియ‌న్ క‌నెక్ట్ అవుతారు. ఎందుకంటే... ఫ్రెష్ ఆక్సిజ‌న్ లభించే లండ‌న్ లాంటి దేశాల్లో.. మాన‌వుని యావ‌రేజ్ ఏజ్ 80-90 సంవ‌త్స‌రాలు వుంది. అలాగే మ‌న‌దేశంలోని నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే... ఎక్క‌వే. అది కాక‌.. కోమాలో ఆక్సిజ‌న్ తో వున్న వ్య‌క్తుల వ‌య‌సు పెరుగుతుంది త‌ప్ప వారి శ‌రీరంలో ఎలాంటి మార్పు వుండ‌ద‌ని కొన్ని ప‌రిశోధ‌న‌లు తేల్చాయి. మైకెల్ జాక్స‌న్ కూడా త‌న య‌వ్వ‌నాన్ని కాపాడుకోవ‌డానికి ఓ ఫ్రెష్ ఆక్సిజ‌న్ బాక్స్ చేయించుకున్నార‌నే ప్ర‌చారం వుంద‌ని.. సినిమాలో కొన్ని వుదాహ‌ర‌ణ‌లు చూపించి.. ప్రేక్ష‌కుల‌ను క‌నెక్ట్ అయ్యేలా క‌న్వెన్స్ చేయ‌గ‌లిగారు డైరెక్ట‌ర్. ఇది ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే క‌నెక్ట్ అవుతుంది త‌ప్ప‌... అన్ని వ‌ర్గాల వారికి క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మే.

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ... దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డానికి కావాల్సిన స‌రంజామాను స‌రిగా సిద్ధం చేసుకోలేక చ‌తికిల ప‌డ్డార‌నే చెప్పొచ్చు. సినిమాటోగ్ర‌ఫి బాగుంది. యాక్ష‌న్ సీన్స్ , య‌ద్ధం సీన్స్ బాగా చిత్రీక‌రించారు. సంగీతం ప‌ర్వాలేదు. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమాకి త‌గ్గ‌ట్టుగానే వున్నాయి.

హీరో సందీప్ మాధ‌వ్ సింగిల్ ఎక్స్ ప్రెష‌న్ తో పెద్ద‌గా చేయ‌డానికి ఇందులో ఏమీలేదు. డైలాగ్ డెలివ‌రీ చాలా వీక్ . యాక్స‌న్ ఎపిసోడ్స్ లో ప‌ర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ కూడా పెద్ద‌గా చేయ‌డానికి ఏమీ లేక‌పోయింది. ముస‌లి మేక‌ప్ లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేకుండా క‌నిపించింది. మ‌రో హీరోయిన్ పాత్ర వేసిన యువ న‌టి యూత్ కి త‌గ్గ‌ట్టు గ్లామ‌ర్ పాత్ర పోషించి ప‌ర్వాలేదు అనిపించింది. సాయి కుమార్ బాగా న‌టించారు. ఇలాంటి పాత్ర‌లు ఇంత‌కు ముందు చాలా సినిమాల్లో చేసిన అనుభ‌వం కాబ‌ట్టి... అవ‌లీల‌గా చేసేశాడు. సురేష్ కూడా రౌద్రం బాగానే చూపించారు. బాబూ మోహ‌న్ మీడియా మీద వేసే సెటైర్లు బాగా న‌వ్విస్తాయి. జ‌బ‌ర్ద‌స్థ్ రాంప్ర‌సాద్, అత‌నికి జోగిగా పనిమ‌నిషి క్యారెక్ట‌ర్ లో క‌నిపించిన అమ్మాయి కూడా ప‌ర్వాలేదు అనిపించారు.
చివ‌ర‌గా... గంధ‌ర్వ ... ప్రేక్ష‌కుని స‌హ‌నాన్ని ప‌రీక్షీస్తాడు

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Review Date
Reviewed Item
Gandharwa
Author Rating
2
Title
Gandharwa Movie Review: Gandharwa... Nothing Special (Rating: 2.5)
Description
Gandharwa Movie Review: Gandharwa... Nothing Special (Rating: 2.5)
Upload Date
July 8, 2022
Share
More

This website uses cookies.