Software Blues: An out and out Comedy Entertainer (Rating: 3.0)

ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్ "సాఫ్ట్ వేర్ బ్లూస్". రివ్యూ

నటీ నటులు
శ్రీరాం, భావన ,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్
కథ ,కథనం, దర్శకత్వం: ఉమాశంకర్
సంగీతం: సుభాష్ ఆనంద్,
సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి,
ఎడిటర్: వి.కె.రాజు,

సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “సాఫ్ట్ వేర్ బ్లూస్”.శ్రీరాం నిమ్మల , భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
సాఫ్ట్ వేర్ లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా చక్కగా తెలియజేస్తూ ఔట్ ఔట్ కామెడీ ఏంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది.

కథ పరంగా భార్గవ్ (శ్రీరాం నిమ్మల) సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా వర్క్ చేస్తూ ఆ కంపెనీ లోనే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందరూ కష్టపడి వర్క్ చేస్తుంటారు.ఆలా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందిన వారికి అమెరికాలో గ్రీన్ కార్డు గిఫ్ట్ గా ఇస్తుందని అనౌన్స్ చేస్తారు. అక్కడ వర్క్ చేసే క్రమంలో అదే ఆఫీస్ లో టీం లీడర్ గా వర్క్ చేసే యక్ష్య (భావన)ను చూసిన తొలి చూపులోనే ప్రేమిస్తాడు.ఆ అమ్మాయిని లవ్ చేస్తూనే అందరూ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కొరకు పోటీ పడుతుంటారు. ఇలా సాఫ్ట్ వెర్ లో జరిగే సన్ని వేషాలన్నీ చాలా ఫన్నీ గా కామెడీ గా ఉంటాయి. భార్గవ్, యక్ష్య ల మధ్య జరిగే లవ్ స్టోరీ కి ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ ఉంది. చివరికి భార్గవ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అది సాధించాడా లేదా? తను ఎంతో గాడంగా ప్రేమించిన యక్ష్య ప్రేమను గెలుచుకొన్నాడా లేదా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.. అదేంటనేది తెరపై చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు .
ఈ చిత్రంలో భార్గవ్ (శ్రీరాం నిమ్మల),.యక్ష్య (భావన) చాలా క్యూట్ గా కనిపించినా చాలా చక్కగా నటించారు.ప్రియురాలిని గాఢంగా ప్రేమించే పాత్రలో భార్గవ్ ఒదిగిపోయాడు. పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అని చెప్పవచ్చు.. మిగలిన పాత్రన్నీ తమ పరిది మేర చాలా చక్కగా నటించారు.
,

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు ఉమాశంకర్ సాఫ్ట్వేర్ లో జాబ్ చేసిన అనుభవం ఉన్నందున ఈ సినిమా ని ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ ట్రయినర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమా న్యాచురల్ కైండ్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నటించిన మిగతా నటీనటులు అందరు కడుపుబ్బా నవ్వించారు అని చెప్పాలి .హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు, సంగీత దర్శకుడు ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించాడు.పాటలన్నీ చాలా బాగున్నాయి.నేపథ్య సంగీతం బాగుంది.సినిమాటోగ్రాఫర్ నిమ్మ గోపి పనితనం బాగుంది. వి.కె.రాజు ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పై నిర్మించిన నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఓవరాల్ గా… చెప్పాలంటే మంచి ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్ గా తెరకెక్కిన "సాఫ్ట్ వేర్ బ్లూస్". సినిమా చూసిన వారందరరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.ఈ సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.