Katha Kanchiki Manam Intiki Movie Trailer Gets Good Response

తిృగున్, పూజిత పొన్నాడ హార్రర్ కామెడీ ‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన..

తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.

తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చ్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు:
తిృగున్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్
టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి
నిర్మాత :- మోనిష్ పత్తిపాటి
దర్శకత్వం :- చాణిక్య చిన్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబత్తిన
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ - ద‌త్తి సురేశ్ బాబు
లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట
మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి :- వైయస్ కృష్ణ
ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి
డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ
ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్
వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి
పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Katha Kanchiki Manam Intiki Movie Trailer Gets Good Response (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share