Telugu

Writer Satyadev janga about Nani’s Shyam Singha Roy

శ్యామ్ సింగరాయ్ ఘన విజయం సాధించడంలో ఎలాంటి సందేహం లేదు: రచయిత సత్యదేవ్ !!!

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఇది రూపుదిద్దుకుంటోంది. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు జంగా సత్యదేవ్ కథను అందించారు. కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు. నాని ఈ చిత్రంలో పలు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. వినూత్నమైన కథాంశం తో రానున్న ఈ సినిమా రచయితగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని సత్యదేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. శ్యామ్ సింగరాయ్ కథతో తనకంటూ ఒక కొత్త డిఫరెంట్ నేమ్ తెచ్చుకున్న సత్యదేవ్ జంగా భవిషత్తులో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఒక ఔట్ అండ్ ఔట్ లవ్ స్టొరీని ప్రముఖ బ్యానర్ ఓకె చేసింది, త్వరలో వాటి వివరాలు సత్యదేవ్ జంగా అధికారికంగా ప్రకటించనున్నారు.

 

దర్శకుడు రాహుల్ సంకృతియన్ శ్యామ్ సింగరాయ్ కథను అద్భుతంగా చిత్రీకరించినందుకు సంతోషాన్ని వెళ్లబుచ్చారు, ఈ విషయంలో సపోర్ట్ చేసిన నాని గారికి, నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి ధన్యవాదాలు తెలిపారు సత్యదేవ్ జంగా. తన భవిషత్తు ప్రణాళికలో భాగంగా ఒక స్టార్ హీరో కోసం సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నారు. అలాగే కాశి బ్యాక్ డ్రాప్ లో ఒక పిరియాడిక్ లవ్ స్టొరీ ఒకటి సిద్ధం చేస్తున్నారు.Writer Satyadev janga about Nani's Shyam Singha Roy

Facebook Comments

About SR

Share