Erra Cheera Move Shoots With 2000 Aghoris

2000 మంది 'అఘోరాల'తో షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఎర్రచీర' శివరాత్రి కి విడుదల

కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ కీల‌క పాత్ర‌లో, బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ వీ సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సౌత్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ‘మ‌హాన‌టి’ ఫేం బేబి సాయి తేజ‌స్వి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ అఖండ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మాట్రిక్స్ సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుంది. 30 నిముషాల ఈ కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసే పనిలో గ్రాఫిక్స్ టీం తలమునకలు అయి ఉంది.. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన అయ్యప్ప పి శర్మ మరియు రెండు వేల మంది అఘోరాలతో క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. ఈ క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక గ్రాఫిక్స్ పార్ట్ లేట్ కావడంతో సినిమా విడుదల కూడా కొంచెం లేట్ అయ్యింది. ఇక గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుని రాత్రికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కేజీఎఫ్ ఫేం అయ్యప్ప పీ శర్మ, మ‌హానటి ఫేం బేబి సాయి తేజస్విణి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా సుమన్ బాబు, కారుణ్య చౌదరి, అలీ, రఘుబాబు, అజయ్, భద్రం, మహేష్, గీతా సింగ్, క‌మల్ కామ‌రాజు, సురేష్ కొండేటి మొదలగు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కందిమళ్ళ ఆదినారాయణ మాటలు: గోపి విమల్ పుత్ర, కెమెరా- చందు, కళ-సుభాష్-నాని, మ్యూజిక్ - ప్రమోద్ పులిగిల్ల, ఎడిటర్ : వెంకట ప్రభు, ఫైట్స్ : నందు, రీ రికార్డింగ్ : చిన్నా, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సి.హెచ్ వీ సుమన్ ‌బాబు.

Erra Cheera Move Shoots With 2000 Aghoris (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%