Gallery

Everyone Should Watch 1997 Movie: Prakash Raj

Everyone Should Watch 1997 Movie: Prakash Raj (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Everyone Should Watch 1997 Movie: Prakash Raj (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Everyone Should Watch 1997 Movie: Prakash Raj (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Everyone Should Watch 1997 Movie: Prakash Raj (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Everyone Should Watch 1997 Movie: Prakash Raj (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

1997 అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ నీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 1997 నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో డాక్టర్ మోహన్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను...ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.

 

ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.
పీఆర్ ఓ : సురేష్ కొండేటి.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share