Movies

Hamesha Hamesha Lyrical Video Song From Manu Charitra Released

Hamesha Hamesha Lyrical Video Song From Manu Charitra Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

శివ కందుకూరి, భ‌ర‌త్ పెద‌గాని, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫిల్మ్, ప్రొద్దుటూరు టాకీస్ 'మ‌ను చ‌రిత్రస చిత్రం నుండి హ‌మేషా..హ‌మేషా లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల

యంగ్ హీరో శివ కందుకూరి న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మ‌ను చరిత్ర`. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై న‌రాల శ్రీ‌నివాస‌రెడ్డి నిర్మిస్తున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి హ‌మేషా..హ‌మేషా లిరిక‌ల్ వీడియోసాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

క‌న‌బ‌డక‌నే తెగ తిరుగుతు న‌ను వెతికిన తుమ్ సే మేరా.. అంటూ సాగే ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ (కె.కె) సాహిత్యం అందించారు. ర‌మ్య బెహ్రా అందంగా ఆల‌పించారు. గోపీ సుంద‌ర్ ఫ్రెష్ ట్యూన్స్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

 

తారాగ‌ణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని, ప్ర‌గ‌తి శ్రీ‌వాత్స‌వ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌, అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్ర‌సాద్‌, ప్ర‌మోదిని, సంజ‌య్ స్వ‌రూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్ర‌దీప్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్ పెద‌గాని
నిర్మాత‌: న‌రాల‌ శ్రీ‌నివాస‌రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: కాజ‌ల్ అగ‌ర్వాల్‌
బ్యాన‌ర్‌: ప్రొద్దుటూరు టాకీస్‌
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాహుల్ శ్రీ‌వాత్స‌వ్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: ఉపేంద‌ర్ రెడ్డి
సాహిత్యం: సిరాశ్రీ‌, కేకే
కొరియోగ్ర‌ఫీ: చంద్ర‌కిర‌ణ్‌
యాక్ష‌న్‌: 'రియ‌ల్' స‌తీష్‌, నందు
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

Hamesha Hamesha Lyrical Video Song From Manu Charitra Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share