Madhura Wines Trailer Out Now

Processed with VSCO with preset

హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా ఎస్ ఒరిజినల్స్, ఆర్‌ కె సినీ టాకీస్ 'మధుర వైన్స్' సినిమా ట్రైలర్ విడుదల..

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం మధుర వైన్స్. గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. 1.48 నిమిషాల నిడివి ఉన్న టైలర్ ఆసక్తికరంగా సాగింది. అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు

 

టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం జయకిషోర్.బి
నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు
కో ప్రొడ్యూసర్: సాయి శ్రీకాంత్ చెరువు
బ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్ కె సినీ టాకీస్
సంగీత దర్శకుడు: కార్తిక్ rodriguez, జయ్ క్రిష్
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : అమర్ నాథ్ చావలి
ఎడిటర్: వర ప్రసాద్.ఎ
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లి చెరుకూరి

Madhura Wines Trailer Out Now (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share