What mistake did Shari Lahari do? Lady Arjun Reddy is safe this week in Big Boss 5 Telugu house

లహరి తప్పేముంది.. లేడీ అర్జున్ రెడ్డి ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో సేఫ్! స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 5 సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ షోలో 19 మంది కంటస్టెంట్లు అడుగుపెట్టగా అందులో లహరి ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన ఈమె యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా యాంకర్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న లహరి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈమె హౌస్ లోకి ఎంటరైయినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల విషయంలో ఈమె కొంతమేర అరిచి గగ్గోలు పెట్టినప్పటికీ ఈమె అరపు వెనక నిజమే ఉంటుంది. ఇలా తన తప్పు లేకుండా తన నిందిస్తే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఈమె ముక్కుసూటి తనంగా మాట్లాడటం వల్ల ఈమె హౌస్‌లో ఫిమేల్ అర్జున్ రెడ్డిలా వ్యవహరిస్తోన్నారంటూ కితాబిస్తోన్నారు నెటిజన్లు. హౌస్ లోకి వెళ్ళిన తొలి వారమే లహరి హమీదాను ఫేస్ చేసిన సందర్భాల్లో లహరీ ఇచ్చిన కౌంటర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే తొలి వారం నామినేషన్ లో ఉన్న ఈమె ఆర్కే కాజల్ తో గొడవ పడుతూ స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక రెండో వారంలో భాగంగా లహరి -రవి -ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. తను యాంకర్ గా ట్రై చేస్తుందని అందుకోసమే రవి వెంట పడుతోంది అంటూ రవి తనపై లేనిపోని మాటలు మాట్లాడటమే కాకుండా.. హౌస్ లో ఎంతో మంది పెళ్లి కానివారు ఉన్నప్పటికీ తను నా వెంట పడుతోందని లహరి గురించి రవి చెబుతూ తన గురించి పెద్ద ఎత్తున నెగిటివిటీ క్రియేట్ చేశారు. అయితే ఇందులో లహరి తప్పు ఏమాత్రం లేదని, రవి కావలసిగానే తనపై నెగిటివిటీని క్రియేట్ చేశారని ప్రేక్షకులు తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా లహరికి మద్దతు తెలుపుతూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా రవి- లహరి-ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్నటువంటి లహరి హౌస్ లో ఉండటం కోసం బాగా క్రీమ్ స్పేస్ ఆక్యుపై చేసినప్పటికీ.. తనపై వచ్చిన గొడవలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కావలసిగానే తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలియడంతో నెటిజన్లు ఈమెకు మద్దతును తెలుపుతున్నారు. అయితే అక్కడ తప్పంతా యాంకర్ రవి, ప్రియాదే కావడంతో లహరి ఈ వారం సేఫ్ అని.. లహరికి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు సమాచారం

Facebook Comments

About SR

Share

This website uses cookies.

%%footer%%