Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy

Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Honey Trap Movie Is An Emotional Entertainer Director Sunil Kumar Reddy (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "హనీ ట్రాప్" ను సెప్టెంబర్ 18న విడుదల చేస్తున్నాం - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి... 18 స్టేట్ అవార్డ్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలందుకున్న ఏకైక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 'హనీ ట్రాప్' అనే చిత్రంతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో... భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామనరావు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ... "గతంలో నా దర్సకత్వంలో తెరకెక్కిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలు మంచి విజయాలు అందించాయి. ఇప్పుడు తెరకెక్కించిన 'హనీ ట్రాప్' కూడా అలాంటి కోవకు చెందిన ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ చిత్ర కథ మా నిర్మాత వి.వి. వామన్న రావు గారిదే. నేను మాటలు, దర్శకత్వం వహించాను. హనీ ట్రాప్ అనేది ఒక అంతర్జాతీయ అంశం. ఈ కాన్సెప్ట్ మీద 3, 4 చిత్రాలు చేసే మెటీరియల్ ఉంది. ప్రతిరోజూ మనం పత్రికల్లో ఈ హనీ ట్రాప్ కథలు చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్ లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా చిక్కుకుని ఉన్నారు. ఈ ట్రాప్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా సులభంగా మోసం చేసేయవచ్చు. అలాంటి అంశాలను కూడా ఇంటెరెస్టింగ్ గా యూత్ ని ఆకర్షిస్తూ సినిమాను తీసాము.

ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే. రుషి, మిస్ వైజాగ్ శిల్ప మరియు తేజు అనే యంగ్ టాలెంట్ ని పరిచేయం చేస్తున్నాము. మా నిర్మాత కూడా మంచి పాత్ర చేసారు. లజ్జ సినిమా హీరో శివ దందా మంచి పొలిటికల్ క్యారెక్టర్ చేసాడు.
నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫలితం పక్కన పెడితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఒక కథకి సినిమా రూపం లో ప్రాణం పోస్తాము. ఈ ప్రక్రియ నాకు కిక్ ఇస్తుంది. అందుకే సినిమా అంటే ప్యాసన్.

నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్ ఉంటుంది. నాకు అవార్డ్స్ వచ్చిన సొంత ఊరు, గంగ పుత్రుల్లో కూడా రొమాన్స్ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు. మన హిందూ కల్చర్ లో కూడా శృంగారం ఉంది. కానీ ఇప్పటి పాశ్చాత్య సంస్కృతి వల్ల మనం అని దాచేసుకుంటున్నాం, సిగ్గుపడుతున్నాం. మనం ఓపెన్ గా డిస్కస్ చేయటం లేదు. వీటిని బ్రేక్ చేయటానికి నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, హనీ ట్రాప్ లాంటి సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమా దర్శకుడుని మీరు ఇలాంటి చిత్రాలు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే... ఒక 9 ఏళ్ళ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఆ అమ్మాయి సొసైటీ ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని ఎలా చెప్తుంది? ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాల విడుదల చాలా మంది బాధితులు పోలీసులును ఆశ్రయించారు. దాంతో నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అభినందించింది.

హనీ ట్రాప్ అనేది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ తో చిత్రీకరించాము. ఈ నెల సెప్టెంబర్ 18న విడుదల అవుతుంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

ఈ చిత్రం తరువాత ఇంకా మూడు సినిమాలు నా దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఇందులో మొదటిది "వెల్కమ్ తో తీహార్ కాలేజీ". ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పే సినిమా. విడుదల కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. చదలవాడ శ్రీనివాస్ గారు ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇది తండ్రి కొడుకుల కథ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇంకో సినిమాకి బాపిరాజు గారు నిర్మాత. త్వరలో ఈ రెండు సినిమాల గురించి అన్ని వివరాలు చెబుతా" అంటూ ముగించారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.