Karthik Sai’s The Killer Movie Success Meet Held

Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

కార్తీక్ సాయి ది కిల్లర్ సక్సెస్ మీట్
ఇన్నేళ్ల మా కష్టం ఈ రోజు ఫలించింది : హీరో కార్తీక్ సాయి

కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్'స్ ది కిల్లర్. ఈ సినిమా ఈ నెల 3న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్బంగా ఆదివారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో,, దర్శకుడు కార్తీక్ సాయి, హీరోయిన్ డాలీషా, నిర్మాత వాసు దేవరావ్ తో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా .. ఎడిటర్ నాని మాట్లాడుతూ .. కార్తీక్ ది కిల్లర్... సక్సెస్ మీట్.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కార్తీక్ సాయి హీరో , దర్శకుడిగా చాలా కష్టపడ్డాడు. అయన కష్టం ఈ రోజు సక్సెస్ రూపంలో మాకు దక్కింది. ఈ సినిమా విషయంలో చాలా సపోర్ట్ ఇచ్చిన వాసు గారికి థాంక్స్, అయన లేకుంటే ఈ సినిమా లేదు. చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీకి చాలా మంచిది. ఈ సినిమా విషయంలో టీం అందరు ఎంతగానో కష్టపడ్డారో తెలుసు. ఈ సినిమా విషయంలో సపోర్ట్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

నటుడు మధు మాట్లాడుతూ .. ఈ సినిమాలో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన కార్తీక్ అన్నకు థాంక్స్. ఇన్నాళ్లు నన్ను హైడ్ చేసారు.. ఎందుకు అన్న అని అడిగితె నిన్ను చూపిస్తే మన కథ తెలిసిపోతుంది అని బయటికి చూపించలేదు. ఈ సినిమా విషయంలో ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి, ఒకటి డైరెక్టర్ చిన్నా గారికి, రెండు హీరో కార్తీక్ కు. అయన ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమా చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఈ సినిమా విషయంలో వాసుదేవ్ గారు ఇచ్చిన సపోర్ట్ తోనే ఇంతబాగా వచ్చింది సినిమా అన్నారు.

కెమెరా మెన్ ఆర్యన్ మాట్లాడుతూ.. చాలా మంచి ప్రయత్నం. ఈ సినిమాకు కర్త కర్మ, క్రియ అంతా కార్తీక్ సాయి. అయన లేకుంటే ఈ రోజు నేను ఈ స్టేజి మీద ఉండేవాడిని కాదు. అలాగే వాసు అన్న.. ప్రతి విషయంలో అయన ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. అలాగే హీరోయిన్ డాలీషా చాలా బాగా చేసింది. ఇక దర్శకుడూ చిన్న చాలా అద్భుతంగా తీసాడు. అయన ఎంతగా కష్టపడ్డాడో మాకు తెలుసు. మేము పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చారు ప్రేక్షకులు వారందరికీ థాంక్స్ అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ .. ఈ సినిమాను ఇంతగా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్, ఈ సినిమా కోసం టీం ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ సినిమా విషయంలో ఫలితం మా టీం మొత్తానికి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు తమ సినిమా అని కష్టపడ్డారు. నాకు ఇంతమంచి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన కార్తీక్ కు, వాసు గారికి థాంక్స్, ఏ సినిమా అయినా కూడా మూడు విషయాలపైనే ఆధారపడి ఉంది.. అది ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ , ఎంటర్ టైన్మెంట్ .. ! అలాగే ఈ సినిమా కూడా అదే తరహాలో ఎంటర్ టైనేమేంట్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. సినిమా ప్రేక్షకులతో కలిసి చూసాను. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.

హీరో , దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ .. మా సక్సెస్ లో అందరు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇది నా పదేళ్ల కష్టం. దాన్ని ఈ రోజు నిజం చేసారు. ఈ కరోనా సమయంలో ఏ థియటర్స్ లో హౌస్ ఫుల్ లేదండి.. నా సినిమానే కాదు ఎవరి సినిమా అయినా ఫుల్స్ లేవు.. కానీ ఈ వారంలో విడుదలైన సినిమాల్లో మా సినిమాకు ఎక్కువ కలక్షన్స్ బాగున్నాయి. రెస్పాండ్ బాగుంది. సినిమా చుసిన వారంతా కొత్తవాళ్లు తీసినట్టు లేదు.. అని అంటున్నారు . ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం థియటర్స్ పెరిగాయి. ఈ ఆనందం తో నిద్దర పోయి ఐదు రోజులైంది. ఈ సినిమా విషయంలో నెగిటివ్ మాట్లాడిన వాళ్లకు గూబ పగిలే సమాధానం వచ్చింది. ఈ సినిమా విషయంలో ఎడిటర్ నాని ప్రతి విషయంలో సపోర్ట్ చేసాడు. పోస్టర్, అన్ని అతనే చేసాడు. అతను నా వెంటూనే దైర్యంగా ఉంటుంది. నాకు తొందరగా ఏది దక్కదు.. ఇదైనా దక్కుతుందా లేదా అనుకున్నాను కానీ విజయం దక్కింది. ఈ సినిమాలో పాడింగ్ లేదు , కొత్తవాళ్లు అంటున్నారు.. సినిమాకుఇ కంటెంట్ ఉంటె పాడింగ్ అవసరం లేదు. ఈ సినిమా బాగా తీసారని అందరు అంటున్నారు. అది చాలు మాకు. ఈ సినిమా విషయంలో ఇష్టంతో కష్టపడి చేసాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి చేసారు. మా సతీష్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను కరెక్ట్ గా షూటింగ్ టైం కు చేసానంటే కారణం ఆయనే. అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ ప్రియా. అలాగే మా సినిమా ఇంతబాగా రావడానికి కారణం వాసుగారు.. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కలిపి 150 కి పైగా థియటర్స్ లో విడుదల చేసాం. అన్ని సెంటర్స్ లో సినిమాకు మంచి టాక్ వచ్చింది. అది చాలు మాకు. ఈ సినిమాకు మీరిచ్చిన సపోర్ట్ తో మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే మా తమ్ముడు సంతోష్ కు థాంక్స్, అలాగే మా అమ్మ నాన్న, అలాగే వాసుగారికి అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను, ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంది.. అందులో కూడా డాలీషా నే హీరోయిన్ , అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్ అన్నారు.

నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ .. ఈ సినిమాకు నాకింత సపోర్ట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. మేము కష్టపడి తీసిన సినిమాను మీరు అందరించినందుకు ప్రేక్షకులకు, మీడియాకు థాంక్స్ . ఏ సినిమాకు అయినా ప్రేక్షకులే ఫైనల్, ఈ సినిమాను ప్రేక్షకుల చేతిలో పెట్టాం.. వారు మాకు మంచి విజయాన్ని అందించారు. ఈ సినిమా విషయంలో ఎడిటర్ నాని, కెమెరా మెన్ ఆర్యన్ , సతీష్, ప్రియా ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఎంతగానో కష్టపడ్డారు.. ముక్యంగా మా నాని, తాను పడిన కష్టం గురించి నేను దగ్గరగా చూసాను, నిజంగా అతని కష్టం ఈ రోజు నిజమైంది. ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన వ్యక్తి సతీష్. ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. హీరోయిన్ డాలీషా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక్క టెక్ లో ఏ సీన్ అయిన సరే అదిరిపోయేలా చేసేది. ఈ సినిమాకు ఇంతమంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు మరోసారి థాంక్స్ అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. చిన్న సినిమాగా విడుదలైన కిల్లర్ సినిమా పెద్ద విజయం అందుకోవడం ఆనందంగా ఉంది. చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడే పరిశ్రమకు మంచింది. అలాగే ఈ సినిమా విషయంలో కార్తీక్, వాసుగారు మొదటి రోజు ఎలా ఉన్నారో.. సినిమా విడుదల తరువాత ఈ రోజు వరకు వాళ్లలో అదే ఎనర్జీ కనిపించింది. ఇలా చాలా మంది నిర్మాతలు ఉండరు.. సో ఈ నిర్మాతలు ఈ సక్సెస్ తో మరిన్ని సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ ప్రియా మాట్లాడుతూ.. మూడు రోజుల నుండి డాలీషా మీద, నా మీద అటాక్స్ అవుతూనే ఉన్నాయి. కష్టపడి పనిచేసాం. కష్టం విషయంలో అడా, మగ తేడా లేదు.. సినిమా చుడండి నచ్చితే బాగుందని రాయండి. లేదంటే తిట్టండి అంతే కానీ ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ మాకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు రాయండి. మేమేమి టాటా బిర్లా ల పిల్లలం కాదు.. పైసా పైసా తెచ్చుకుని సినిమా చేసాం. నమ్మకంతో సినిమా చేసాం.. నచ్చితే వెళ్లి చుడండి అంతే కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పకండి. సినిమా తీసిన వాళ్ళం మాకు ఎలా చేయాలో ఏమి చేయాలో తెలుసు.. అంతే కానీ మాకు సలహాలు ఇవ్వకండి అన్నారు.

Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthik Sai’s The Killer Movie Success Meet Held (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%