Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored

Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్‌’ సన్సార్ పూర్తి వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10 రిలీజ్‌కు స‌ర్వం సిద్ధం

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో సీటీమార్ థియేట‌ర్స్ సంద‌డికి సర్వం సిద్ధ‌మైన‌ట్టే...ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్‌, యాక్ష‌న్ హీరో అయిన గోపీచంద్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఇక సినిమా రిలీజ్ కావ‌డ‌మే తరువాయి. పండ‌గ‌కు కుటుంబం అంతా క‌లిసి ఎలాంటి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమాను చూడాల‌నుకుంటారో అలాంటి సినిమానే మా సీటీమార్‌. వినాయ‌క చ‌వితి కానుకగా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ సంపత్ నందిగారు మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను ప‌ర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌న అల‌రించేలా డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్స్‌లో వ‌స్తున్న మా సీటీమార్ చిత్రం హండ్రెడ్ ప‌ర్సెంట్ ఆడియెన్స్‌కు మంచి ఫీస్ట్‌లా ఉంటుంది’’ అన్నారు.

 

న‌టీన‌టులు:

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించిన‌ ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.

సాంకేతిక వ‌ర్గం:
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి
బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్
స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్
సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై

Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Gopichand And Sampath Nandi’s Seetimaarr Movie Censored (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share