Jai Ho Indians Movie First Look Poster Is Out

Jai Ho Indians Movie First Look Poster Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ 'జయహో ఇండియన్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి..

 

టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి
సంగీతం: సురేష్ బొబ్బిలి
సౌండ్ డిజైన్: నాగార్జున తల్లపల్లి
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
లిరిక్స్: కాసర్ల శ్యామ్
VFX: విరించి ప్రొడక్షన్స్
ఆర్ట్: మోహన్, మగేశ్వర రావు
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share