Sunil’s First Look As Mohammed Khayum In Bujji Ila Raa Movie Is Out

Sunil’s First Look As Mohammed Khayum In Bujji Ila Raa Movie Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sunil’s First Look As Mohammed Khayum In Bujji Ila Raa Movie Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

బుజ్జీ... ఇలారా...’ చిత్రంలో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్ లుక్ విడుదల.

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్ ను బ‌ట్టే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు.

 

సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వ‌ర రెడ్డి
సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం: గ‌రుడ‌వేగ అంజి
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌
బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
డైలాగ్స్‌: భాను, చందు
ఆర్ట్‌: చిన్నా
ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌
ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
మేక‌ప్‌: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Facebook Comments
Share