Nitiin’s Maestro Movie Will Stream On Disney Hotstar On September 17th

Nitiin’s Maestro Movie Will Stream On Disney Hotstar On September 17th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Nitiin’s Maestro Movie Will Stream On Disney Hotstar On September 17th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Nitiin’s Maestro Movie Will Stream On Disney Hotstar On September 17th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Nitiin’s Maestro Movie Will Stream On Disney Hotstar On September 17th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్‌లో హీరో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు డిస్నీహాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో హీరో నితిన్ న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుని న‌డుస్తున్నాడు. ఇక సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌ధాన తారాగ‌ణమైన న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా, వి.కె.న‌రేశ్‌, జిస్సుసేన్ గుప్తా, త‌దిత‌రులు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు.

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్‌. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్‌ సినిమాపై జ‌బ్ క్రియేట్ చేశాయి.

 

మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు:

నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి

సాంకేతిక వ‌ర్గం:

డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకేళ్ళ
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: జె యువరాజ్‌
ఎడిటర్‌: ఎస్‌ఆర్‌ శేఖర్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share