Cheruvaina Dooramaina Movie Hero Sujith Interview

Cheruvaina Dooramaina Movie Hero Sujith Interview (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Cheruvaina Dooramaina Movie Hero Sujith Interview (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Cheruvaina Dooramaina Movie Hero Sujith Interview (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Cheruvaina Dooramaina Movie Hero Sujith Interview (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

’చేరువైన... దూరమైన’లో క్లైమాక్స్ సీన్ ఇంతకు మందెన్నడూ చూసుండరు- హీరో సుజిత్ రెడ్డి

వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన... దూరమైన’. ఇందులో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. తరుణి సింగ్ హీరోయిన్. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుజిత్ రెడ్డి తన నేపథ్యం.. సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం...

నేను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్ ని...

నేను 100 మీటర్ల పరుగు పందెంలో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ ని. అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. అయితే బి.టెక్.లో చేరడం వల్ల ఆ కాలేజీలో అథ్లెటిక్స్ కి పెద్ద ఎంకరేజ్ వుండేది కాదు. దాంతో నేను బి.టెక్.పూర్తయిన తరువాత సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేశా. నేను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్ ని. ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా వుంటాయో మనందరికీ తెలుసు. ఆయన ‘ఇడియట్’ సినిమాను చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా. మా మావయ్య కమెడియన్ శ్రీనివాసరెడ్డి నీవే స్వతహాగా సినిమాల్లో రాణించాలనేవారు. దాంతో దాదాపు 8 ఏళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేవి. అయితే నాకు మాత్రం హీరోగానే లాంఛ్ అవ్వాలని వుండేది. శ్రీనివాసరెడ్డి గారి సినిమా ‘భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు’లో ఓ చిన్న రోల్ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ అలాంటి పాత్రలు చేయనని చెప్పేశా.

ఎనిమిదేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా...

హీరోగా నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. చాలా మంది ‘ఎందుకు నీవు ఆఫీసుల చుట్టూ తిరగడం.. మీ మావయ్య అనుకుంటే... పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు కదా. ఎందుకంత కష్టపడుతున్నావు’ అనే వాళ్లు. కానీ నేనే సొంతంగా రాణించాలి.. నేనే నిర్మాతలని, దర్శకులను మెప్పించి సినిమా చేయాలనేవాణ్ని. అలా ప్రయత్నిస్తున్నప్పుడే చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు. మీరు హీరో కావాలి అంటే... బాగా స్లిమ్ అవ్వాలి అన్నారు. నేను బాగా ఫ్యాట్ గా వుండేవాణ్ని. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా. ఫస్ట్ నా మీద ఓ ట్రయల్ షూట్ చేశారు. దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు. నిర్మాతలకు దర్శకుడే నన్ను పరిచయం చేశారు. అయితే వాళ్లు ఓ పెద్ద హీరోతో వెళితే బాగుంటుందనే ఆలోచనలో వుండగా... దర్శకుడు నేనైతేనే ఈ సినిమాకి ఫిట్ అవుతానని చెప్పారు. దాంతో ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది. వాళ్లు కావాల్సినంత బడ్జెట్టును ఇచ్చేశారు. కొత్తవాణ్ణైనా బడ్జెట్టుకు వెనకాడకుండా కోట్లు ఖర్చుచేశారు. నాకు కెమెరా ముందు నటించడానికి భయమేమీ వేయలేదు. దర్శకుడు తనకు కావాల్సిన దాన్ని రాబట్టుకున్నారు. మంచి కంఫర్ట్ జోన్ లోనే నేను పని చేశా. మావయ్యకు ఈ సినిమాను చూపించాం. నా నటనలో చిన్న చిన్న కరెక్షన్స్ వున్నా.... అవన్నీ నువ్వే రాను రాను కరెక్షన్ చేసుకోగలవు అని ప్రోత్సహించారు.

యాక్షన్ సీన్స్ చేయడమే నా బలం...

నేను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్ లో నటనపై శిక్షణ తీసుకున్నా. అక్కడ పెద్దగా నేర్చుకుంది ఏమీ లేదు. ఆ తరువాత నేనే స్వతహాగా మిర్రర్ లో చూసుకుంటూ... నాకు నేనే నటనను మెరుగు పరుచుకున్న. మా మేనమామ శ్రీనివాసరెడ్డి కూడా సినిమాల్లో వుండటంతో బహుశా ఆ బ్లడ్ నాలో కూడా వుండటంతో నటనపై ఆసక్తి ఏర్పడిండి. నాకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే నా బలం. ఈ చిత్రంలో క్లైమాక్స్ ప్రధానం. మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్ పై సందేహాలు వచ్చాయి. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని అందరూ అన్నారు. కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు. చాలా బాగా వచ్చింది. దర్శకుడు చంద్రశేఖర్ కానూరి... ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు. ఆయన మొదటి సినిమా ‘రథం’ చేశారు. ఇప్పుడు నాతో చేశారు. ఆయన నాకు నెరేషన్ ఏదైతే చేశారో అదే తెరమీద చూపించారు. మ్యూజిక్ బాగుంది. అన్ని పాటలూ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఫస్ట్ కాపీ చూసి వాళ్లు హ్యాపీగా పీల్ అయ్యారు. ఇందులో క్లైమాక్స్ ఏ సినిమాలో వుండదు. చాలా యూనిక్ గా వుంటుంది. దాన్ని కాకినాడలోని ఉప్పాడ బీచ్ లో తీశాం. చాలా బాగా వచ్చింది. ఇందులో తమిళ నటుడు శశి ప్రతినాయకుడుగా చాలా బాగా చేశాడు. హీరోయిన్ తరుణితో కలిసి టామ్ అండ్ జెర్రీలాగ పోటీ పడి చేశాం. మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన, బ్రదర్ పాత్రలో తమిళ నటుడు శశి నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు.

టాప్ డైరెక్టర్ల ఆశీర్వాదం మరువలేను...

ఈ చిత్రం టీజర్ ను మొదట డైరెక్టర్ గోపీ చంద్ మలినేని చేశారు. మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ట్రైలర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చేశాం. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వీళ్లిద్దరి ఆశీస్సులు మాకు అందించారు. అది మరువలేం. ఈ సినిమా తరువాత ఇంకా ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు. చాలా సినిమా అవకాలైతే వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాతే ఒప్పుకుందాం అనుకున్నా.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.