Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August

Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టు లో ధియెట‌ర్స్ లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కి సిద్ద‌మ‌వుతున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బ‌జార్ రౌడి

హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి కామెడి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమా ని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వారావు స్క్రీన్ మీద త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని చూపించారు, ఈ చిత్రానికి . సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ చిత్రాన్ని చాలా బాగా కుదించారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ఈ చిత్ర క‌థ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,ష‌ఫి, స‌మీర్ లాంటి పెద్ద న‌టీన‌టుల‌తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాము. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు లో విడుద‌ల చేయ‌నున్నాము. అని అన్నారు

ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ఈ చిత్ర అవ‌కాశాన్ని నాకిచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు కి, నిర్మాత శ్రీన‌వాస‌రావు గారికి ప్ర‌త్యేఖ ద‌న్య‌వాధాలు. బ‌ర్నింగ్ స్టార్ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో వున్న సంపూ ని ఇలాంటి ప‌క్కా క‌మ‌ర్షియల్ క‌థ‌లోని ఆయ‌న స్టైల్ ని యాడ్ చేసి తెర‌కెక్కించాము. ప్రేక్ష‌కుల కి న‌వ్వులు, పాట‌లు, ఫైట్స్ కిక్కిచ్చే అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని అంద‌రి స‌హ‌యస‌హ‌కారాలతొ ఈ చిత్రాన్ని పూర్తిచేసాము. ఇటీవలే మా మోద‌టి కాపి చూసిన నిర్మాత చాలా ఆనందంగా వున్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ.. బ‌జార్ రౌడి చిత్రాన్ని ఎక్క‌డా ఎవ‌రికి ఇబ్బందిలేకుండా క‌థ విష‌యం లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాము. పెద్ద చిత్రాల‌కి ధీటుగా ఈ చిత్రాన్ని ఈ అగ‌ష్టు లో ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నాము. నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి లాంటి పెద్ద కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు లో విడుద‌ల‌కానుంది. అని అన్నారు

న‌టీ న‌టులు..
బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు
నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు
మాట‌లు: మ‌రుధూరి రాజా
సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌
సంగీతం: సాయి కార్తిక్‌
ఎడిటర్: గౌతం రాజు
ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా
కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌
మేక‌ప్‌: శ్రీకాంత్‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి
కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు

Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Burning Star Sampoornesh Babu’s Bazar Rowdy Is All Set To Release Worldwide In Theaters In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%