Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out

Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

సంజయ్ రావ్ హీరోగా ''గుట్టు చప్పుడు'' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు , ఓ పిట్ట కథ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

అనంతరం .. చిత్ర హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. గుట్టు చప్పుడు సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. నేను చేసిన పిట్టకథ సినిమాలోని పాత్రకు ఇది పూర్తీ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నాకు దర్శకుడు మణీంద్రన్ చెప్పినప్పుడు అయన చెప్పిన కథ కంటే కూడా అయన ఇచ్చిన నేరేషన్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్, షార్ట్ డివిజన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలతో కథను చెప్పారు .. కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ .. అన్నిరకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి .. అలాగే మా నిర్మాత లివింగ్ స్టన్ చాలా సరదాగా ఉంటారు.. మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి .. నేను ప్రొడ్యూసర్ అనే విధంగా అస్సలు ఉండరు, ఆయనిచ్చిన సపోర్ట్ తో చాలా స్పీడ్ గా షూటింగ్ చేసాం. ఈ గుట్టు చప్పుడు చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.

 

నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ ...ముందుగా మా హీరో సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు .. నేను దర్శకుడు మణీంద్రన్ చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్ .. మా కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నప్పుడు చాలా కథలు అనుకున్నాం.. కానీ గుట్టు చప్పుడు కథ నాకు బాగా నచ్చింది. ముక్యంగా ఆ కథను అల్లిన విధానం బాగుంది .. అందుకే ఈ సినిమా మొదలెట్టాం .. ఇక ఈ సినిమాలో హీరోగా బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి నటిస్తున్నాడు .. ఈ సందర్బంగా బ్రహ్మాజిగారికి థాంక్స్ చెబుతున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు షెడ్యూల్స్ ఉన్నాయి .. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతాం. తప్పకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు.

దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ ... మా హీరో సంజయ్ కి హ్యాపీ బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నాను .. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఇది వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది .. పక్కా మాస్ అండ్ లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ అని చెప్పాలి. కొత్త తరహా కథతో చాలా విభిన్నమైన దిశగా కథ ఉంటుంది. తప్పకుండా నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముక్యంగా యూత్ ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా విషయంలో మా నిర్మాత సపోర్ట్ చాలా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఈ కథ అనుకున్న తరువాత హీరోగా ఎవరు అయితే బాగుంటుందని చాలా మంది హీరోలను అనుకున్నాం.. కానీ పిట్టకథ సినిమాలో హీరోగా చాలా చక్కని నటన కనబరిచిన సంజయ్ అయితే బాగుంటుందని ఆయనను కలవడం .. కథ విని వెంటనే ఓకే చెప్పడంతో సినిమా మొదలెట్టాం. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసాం.. ఒక షెడ్యూల్ వైజాగ్, రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో షూట్ చేసాం .. మిగతా రెండు షెడ్యూల్స్ కరోనా వేవ్ తగ్గగానే మొదలుపెడతాం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

కెమెరా మెన్ రాము మాట్లాడుతూ .. ఈ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కథ ..అన్ని రకాల కమర్షియల్ అండ్ టెక్నీకల్ అంశాలతో తెరకెక్కిస్తున్నాం అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి మాట్లాడుతూ .. ఇది చాలా మంచి కథ.. ఇలాంటి కథకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ .. దర్శకుడు మణీంద్రన్ పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు .. తప్పకుండా మా టీం అందరికి మంచి హిట్ ఇచ్చే చిత్రం అవుతుంది అన్నారు.

మాటల రచయిత సురేష్ కుమార్ మాట్లాతుడు .. నేను ఇప్పటికే శివరంజని, దేవరకొండ లో విజయ్ ప్రేమకథ చిత్రాలకు పనిచేసాను, ఇది నా మూడో సినిమా. దర్శకుడు మణీంద్రన్ చాలా కొత్త కథను చెప్పాడు .. సినిమాకు సరైన కథ ఉంటేనే దానికి డైలాగ్స్ మరింత బలాన్ని ఇస్తాయి. చాలా చక్కని డైలాగ్స్ కుదిరాయి. తప్పకుండా ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.

ఈ చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు , ప్రొడక్షన్ మేనేజర్ : ఓ కృష్ణా రెడ్డి , ఆర్ట్ : నాగు, సిజి : చందు, మాటలు : వై . సురేష్ కుమార్, పిఆర్ ఓ : సురేష్ కొండేటి, కెమెరా : రాము సీఎం , సంగీతం : గౌర హరి, ఎడిటింగ్ : సాయి బాబు తలారి, నిర్మాత : లివింగ్ స్టన్, రచన, దర్శకత్వం : మణీంద్రన్.

Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Sanjay Rao’s Guttu Chappudu Movie First Look Is Out (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share