Social News XYZ     

Maa Voori Premakatha will be a big hit: Noted producer KL Damodar Prasad

"మా ఊరి ప్రేమకథ" తప్పకుండా విజయం సాధిస్తుంది- ప్రముఖ నిర్మాత కెయల్ దామోదర ప్రసాద్!!

మంజునాథ్ హీరోగా తనిష్క్ హీరోయిన్ గా శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై యస్వీ మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "మా ఊరి ప్రేమకథ". విలేజ్ బ్యాక్డ్రాప్ లో రియలిస్టిక్ ఎమోషన్స్ తో రూపొందిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది.. ఈ సందర్బంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియోని విడుదల చేశారు చిత్ర బృందం. ఏప్రిల్ 8న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు కెయల్ దామోదర ప్రసాద్, టి.ప్రసన్న కుమార్, రామసత్యనారాయణ, సాయి వెంకట్, సహనిర్మాత మహేంద్రనాథ్, హీరో, నిర్మాత, దర్శకుడు యస్వీ మంజునాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ప్రముఖ హాస్యనటులు ధర్మవరం సుబ్రమణ్యం తనయుడు రవితేజ, కీ మ్యూజిక్ అధినేత రవి కనగాల, తొలిముద్దు నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు.. మా ఊరి ప్రేమకథ ట్రైలర్ ను కెయల్ దామోదర ప్రసాద్ రిలీజ్ చేయగా చిత్రంలోని ఒక్కో పాటను ఒక్కో అతిధి ఆవిష్కరించారు.. కీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలయింది.. అనంతరం...

ప్రముఖ నిర్మాత కెయల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి.. అన్నీ ప్రేమకథలు ఒకటే.. ఏం మారవు. డిఫరెంట్ జోనర్సలో ప్రెజెంటేషన్ కొత్తగా తెస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే రియలిస్టిక్, ర కంటెంట్ తో తీసారనిపిస్తుంది. ఎనర్జిటిక్ లవ్ స్టోరి. ఎమోషన్స్ హైగా ఉన్నాయి. విజువల్స్, కంటెంట్ చిత్రీకరణ చూస్తుంటే ఈ చిత్రం సక్సెస్ కి దెగ్గరలోనే వుందనిపిస్తుంది... ఈ చిత్రం హిట్ అయి మంజునాథ్ కి మంచి పేరు రావాలి అన్నారు..

 

టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. రాయలసీమ బాక్డ్రాప్ లో వచ్చిన ప్రేమకథలు అన్నీ మంచి హిట్ అయ్యాయి.. ఆకోవలోనే మంజునాథ్ ఈ చిత్రం చేశారు.. "ప్రేమించుకుందాం రా" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం కూడా అంతే హిట్ కావాలి అన్నారు.

హీరో, నిర్మాత, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసాలకోర్చి ఈ చిత్రం తీశాను.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. అవన్నీ లెక్కచేయకుండా ఈ సినిమా తెరకెక్కించాను.. దానికి మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమా విషయంలో నాకు అండ దండగా ఉండి ఎంతో సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గారికి నా థాంక్స్. విలేజ్ బాక్డ్రాప్ లో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది.. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. సినిమా చూసిన వారంతా మంచి సినిమా తీశారని అభినందించారు. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధియేటర్సలలో విడుదల చేస్తున్నాం.. అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మంజునాథ్ ఎంత కష్టపడి ఈ చిత్రం తీశాడో నాకు తెలుసు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు.. గ్యారెంటీగా ఈ చిత్రం హిట్ అయి మంజునాథ్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.. అన్నారు.

సంగీత దర్శకుడు జయసూర్య మాట్లాడుతూ.. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఇది. స్విచ్ వేషన్స్ తగ్గట్లుగా పాటలు రాసి మ్యూజిక్ చేశాను. మంజునాథ్ ఒక మంచి చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయి మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుంది.. అన్నారు.

కీ మ్యూజిక్ అధినేత రవి కనగాల మాట్లాడుతూ.. కీ మ్యూజిక్ ద్వారా 22 సినిమాలు ఆడియో రిలీజ్ చేశాం.. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. విజువల్ గా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించారు. మంజునాథ్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి సక్సెస్ అయి అతనికి మరిన్ని డబ్బులు రావాలి అన్నారు..

ధర్మవరం రవితేజ మాట్లాడుతూ.. మా నాన్నగారు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు సినిమా వారికి ఉంటాయి. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.

మంజునాథ్, తనిష్క జంటగా నటించిన ఈ చిత్రంలో రుద్రప్రకాశ్, లక్ష్మయ్య చౌదరి, పద్మారావు, అమృత, ఉష, హేమ సంగీత, శ్రీనివాసులు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా; కళ్యాణ్ సమి, సంగీతం; జయసూర్య, ఎడిటర్; ఆవుల వెంకటేష్, ఫైట్స్; రియల్ సతీష్, దేవరాజ్, పీఆర్ఓ; జిల్లా సురేష్, డాన్స్; గోపీ, కాస్ట్యూమ్స్; శ్రీను, మేకప్; బాబూరావు.Maa Voori Premakatha will be a big hit: Noted producer KL Damodar Prasad

Facebook Comments
Maa Voori Premakatha will be a big hit: Noted producer KL Damodar Prasad

About SR

PHP Code Snippets Powered By : XYZScripts.com
%d bloggers like this: