SHUKRA Movie Releasing On April 23rd

SHUKRA Movie Releasing On April 23rd (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
SHUKRA Movie Releasing On April 23rd (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

ఏప్రిల్ 23న విడుదలవుతున్న "శుక్ర"

అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ జంటగా నటించిన సినిమా "శుక్ర". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె. సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు.

వరుస చోరీలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు వణుకు పుట్టిస్తున్న ఒక అండర్ వరల్డ్ గ్రూప్ "తగ్స్". అలాంటి పరిస్థితుల్లో ముంబైకి చెందిన ఒక ధనిక జంట అయిన హీరో, హీరోయిన్ వాళ్ల పర్సనల్ లైఫ్ మరియు బిజినెస్ పని మీద విశాఖపట్నంలో అడుగు పెడతారు. అక్కడ హౌస్ పార్టీ, పూల్ పార్టీ ఇతివృత్తంగా సాగుతుందీ కథ. ఆద్యంతం ఎంతో రక్తికట్టించే న్యూ ఏజ్ మేకింగ్, కథాకథనాలతో "శుక్ర" సినిమా ఉండబోతోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్ కి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

"శుక్ర" సినిమాకు సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం ఆశీర్వాద్, రచన-దర్శకత్వం సుకు పూర్వజ్.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%