Varalakshmi Sarathkumar To Do A Lead Role In Horror Entertainer Directed By Darling Swamy In Haweesh Productions

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నాయిక‌గా డార్లింగ్ స్వామి డైరెక్ష‌న్‌లో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌

ఇటీవ‌ల 'క్రాక్'‌, 'నాంది' సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అమితంగా ఆక‌ట్టుకున్న విల‌క్ష‌ణ తార వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నాయిక‌గా హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కాంచ‌న కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కోనేరు స‌త్యనారాయ‌ణ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి ద‌ర్శ‌కుడు.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్‌ర్‌ను రిలీజ్ చేశారు.

 

హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందే ఈ సినిమాలో వర‌ల‌క్ష్మి ఓ విల‌క్ష‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ముర‌ళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ చిత్రానికి గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: డార్లింగ్ స్వామి
స‌మ‌ర్ప‌ణ‌: కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌
నిర్మాత‌: కాంచ‌న కోనేరు
బ్యాన‌ర్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Varalakshmi Sarathkumar To Do A Lead Role In Horror Entertainer Directed By Darling Swamy In Haweesh Productions (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share