
సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న దళపతి విజయ్ 'మాస్టర్' టీజర్
దళపతి విజయ్ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్ హిట్స్ సాధించిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌పై గ్జేవియర్ బ్రిట్టో నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు దక్కించుకున్నారు. ఇంతకు ముందు హీరో విజయ్ చిత్రం 'విజిల్'ను తెలుగులో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు విడుదల చేశారు. 'విజిల్' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మాస్టర్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేశ్ కోనేరు. గురువారం ఈ సినిమా టీజర్ విడుదలైంది.
"జేడీ ఓ అపరాధి
ఓ పంతులుకి ఇంత ధైర్యం ఎడనుంచొచ్చింది
ఆ స్టూడెంట్ ఇంత ప్రాబ్లమెటిక్ అయితే అతన్ని ఎప్పుడో డిస్మస్ చేసుండొచ్చుగా..
జేడీ స్టూడెంట్ కాదు మేడమ్ ప్రొఫెసర్.. "
అనే డైలాగులతో 'మాస్టర్' టీజర్ ప్రారంభమైంది. ప్రతి డైలాగ్‌కు హీరో విజయ్ క్యారెక్టర్‌నుమాస్ యాంగిల్‌లో ఎలివేట్ చేశారు. టీజర్‌లో 'మాస్టర్ ఎవరు.. దళపతి' అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ వస్తుంది. టీజర్ చూస్తుంటే ఓ కాలేజీలో నడిచే స్టోరీ అని అర్థమవుతుంది.
ఇక కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. విజయ్, విజయ్ సేతుపతి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది? ఇద్దరి మధ్య గొడవేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాస్టర్ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
టీజర్ విడుదలైన గంటల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.
ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు మాట్లాడుతూ - "విజయ్‌గారి గత చిత్రం 'విజిల్'ను మా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి విజయ్ నటించిన క్రేజీ మూవీ మాస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. మాస్టర్‌ను భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 'మాస్టర్'గా హీరో విజయ్ ఎలాంటి మేజిక్ చేయబోతున్నారో టీజర్‌లో చిన్న టచ్ ఇచ్చారు. టీజర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరం, ఖైది వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను రూపొందిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు ధీటుగా సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం" అన్నారు.
నటీనటులు:
విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, ఆండ్రియా, సంతాను భాగ్యరాజ్, అర్జున్ దాస్ తదితరులు
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.