Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched

Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

మోర్‌ఫ‌న్‌తో వెంక‌టేశ్‌-త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌-మెహ్రీన్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందునున్న‌బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్ 3’ప్రారంభం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..‘ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‘ ట్యాగ్‌లైన్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతికి అల్లుళ్లు వ‌స్తున్నారంటూ గత సంక్రాంతికి ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడే ‘ఎఫ్‌2 ’చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ని రూపొందిస్తామ‌ని అప్పుడే చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌క‌టించిన విధంగానే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మ‌రింత ఫ‌న్ రైడ‌ర్‌గా సీక్వెల్ మూవీ ఎఫ్‌3ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, ఫైనాన్సియ‌ర్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా..

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ - ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ నవ్వుల జల్లులో ప్రేక్షకులను ముంచెత్తి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సినిమాను రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటి నుండి డైరెక్టర్ అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘ఎఫ్ 2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో ..దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశాడు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్నాం. డిసెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.

 

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ‘‘ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ కాంబినేష‌న్‌ను వెంక‌టేశ్‌-త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌-మెహ్రీన్ జోడీ కాంబినేష‌న్‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చి తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మోర్ ఫ‌న్‌ను యాడ్ చేసి ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అద్భుత‌మైన క‌థ కుదిరింది. మ‌రోసారి విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, వ‌రుణ్ తేజ్‌గారు, త‌మ‌న్నా, మెహ్రీన్ జంట‌లు మిమ్మ‌ల్ని న‌వ్వుల్లో ముంచెత్తుతారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు.

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: శిరీష్‌
స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ర‌చ‌నా స‌హ‌కారం: ఎస్‌.కృష్ణ
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరామ్‌
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు‌
ఆడిష‌న్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయ‌ణ‌, నారా ప్ర‌వీణ్‌

Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Venkatesh, Varun Tej, Tamanna Bhatia, And Anil Ravipudi’s F3 Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share