Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth

Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

"నరసింహపురం" సంచలనం సృష్టించాలి!! -మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్

బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో 'శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల' సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం'. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ... అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా 'నరసింహపురం' టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్.. ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, హీరోయిన్ సిరి హనుమంతు, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ... "మోషన్ పోస్టర్ చాలా చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలాగే 'నరసింహపురం' అనే టైటిల్ కూడా. నాకు చిరకాల మిత్రుడు, క్రికెట్ కో-ప్లేయర్ నందు (నందకిశోర్) హీరోగా పరిచయమవుతున్న 'నరసింహపురం' ఘన విజయం సాధించి అతనితోపాటు... టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి" అన్నారు.

 

హీరో నందు మాట్లాడుతూ.. "అడిగిన వెంటనే సరే అని.. స్వయంగా వాళ్ళింట్లో మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకటిన్నర సంవత్సరంగా మేమంతా పడుతున్న కష్టానికి ప్రతిఫలమే "నరసింహపురం". శ్రీరాజ్
అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు 'నరసింహపురం" చిత్రాన్ని" అని అన్నారు.

శ్రీకాంత్ గారి చేతుల మీదుగా "నరసింహపురం" మోషన్ పోస్టర్ లాంచ్ అవ్వడం పట్ల ఫణిరాజ్ గౌడ్, సిరి హనుమంతు, ఫ్రాంక్లిన్ సుకుమార్, చందు ఆది కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ..."హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ కి 'నరసింహపురం' చాలా మంచి పేరు తెస్తుంది. అతని ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తెచ్చే చిత్రమిది. ఈవారం క్లయిమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాము. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం, చందు ఆది విజువల్ ఎఫెక్ట్స్ 'నరసింహపురం' చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి. మా చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ చేసి, మనస్ఫూర్తిగా మెచ్చుకుని మమ్మల్ని అభినందించిన హీరో శ్రీకాంత్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము" అన్నారు.

కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్', గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Narasimhapuram Movie Motion Poster Launched By Srikanth (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share