First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu

First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి 'ది రోజ్ విల్లా' అనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజా ర‌వీంద్ర, అర్చ‌నా కుమార్‌, శ్వేతా వ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు హేమంత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ, ర‌చ‌న కూడా చేస్తున్నారు. చిత్ర‌మందిర్ స్టూడియో, ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై పి. అచ్యుత్ రామారావు (వెన్నెల రామారావు), ఎ. ప‌ద్మ‌నాభ‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గురువారం హీరో శ్రీ‌విష్ణు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసి, సినిమా మంచి స‌క్సెస్ సాధించాల‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రి లుక్‌ను రివీల్ చేశారు. పాత్ర‌ధారుల హావ‌భావాలు చూస్తుంటే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో ఉత్కంఠ‌భ‌రిత స‌న్నివేశాల‌కు లోటు ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఒక పాత విల్లా చుట్టూ క‌థ న‌డుస్తుంద‌ని ఆ పోస్ట‌ర్ మ‌న‌కు తెలియ‌జేసింది.

ఆద్యంతం థ్రిల్ క‌లిగిస్తూ, కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చొనేలా చేసే స‌స్పెన్స్‌తో న‌డిచే ఈ చిత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోంది. 'పీఎస్‌వీ గ‌రుడ‌వేగ' ఫేమ్ అంజి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ థ్రిల్ల‌ర్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:
దీక్షిత్ శెట్టి, రాజా ర‌వీంద్ర, అర్చ‌నా కుమార్‌, శ్వేతా వ‌ర్మ

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: హేమంత్‌
నిర్మాత‌లు: పి. అచ్యుత్ రామారావు (వెన్నెల రామారావు), ఎ. ప‌ద్మ‌నాభ‌రెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ: 'గ‌రుడ‌వేగ' అంజి
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
ఆర్ట్‌: ఝాన్సీ లింగం
కాస్ట్యూమ్స్‌: శ్రీ‌దేవి కొల్లి, సందీప్ శ‌ర్మ‌
ఎడిటింగ్‌: శివ శ‌ర్వాణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
First Look Of The Rose Villa Launched By Hero Sree Vishnu (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share