Poorna Starrer Back Door Movie Shooting Almost Complete

Poorna Starrer Back Door Movie Shooting Almost Complete (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Poorna Starrer Back Door Movie Shooting Almost Complete (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Poorna Starrer Back Door Movie Shooting Almost Complete (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Poorna Starrer Back Door Movie Shooting Almost Complete (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

శరవేగంగా కర్రి బాలాజీ "బ్యాక్ డోర్"

యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రధారి పూర్ణ, తేజలపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.."పూర్ణ ఎంత మంచి పెర్ఫార్మరో అందరికీ తెలిసిందే. తను ఎంతో చక్కగా కోపరేట్ చేస్తోంది. "బ్యాక్ డోర్" ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. మా నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. హీరో తేజకి కూడా మంచి పేరు వస్తుంది" అని అన్నారు. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'మా దర్శకుడు బాలాజీ శర వేగంతో, కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు" అని వివరించారు.

 

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. "డైరెక్టర్ బాలాజీ అద్భుతంగా కథ-కథనాలు చేసుకున్నారు. అంతే అద్భుతంగా షూట్ చేస్తున్నారు. నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టే చిత్రమిది" అని అన్నారు.

హీరో తేజ మాట్లాడుతూ.. 'పూర్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బాలాజీగారికి, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు.

ఈ చిత్రానికి మేకప్: మోహన్, కాస్ట్యూమ్స్: శ్రీనివాస్, మేనేజర్: అంజి, ప్రొడక్షన్: శ్యామ్, స్టిల్స్: శ్రీనివాస్ విల్లా, కెమెరా & లైట్స్: ఓంకార్ యూనిట్, అసిస్టెంట్ డైరెక్టర్: సాదిక్, అసోసియేట్ డైరెక్టర్: రవి రోహిత్, కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, రచనాసహకారం: భూపతిరాజు రామకృష్ణ-రవి రోహిత్.జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share