ఆలోచింపజేసే విశ్వక్ చిత్ర టీజర్ విడుదల!
అజయ్ కతుర్వర్ - డింపుల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ''విశ్వక్''. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వేణు ముల్కాల దర్శకత్వం వహించారు. నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 'విశ్వక్ ప్రపంచమంతా వ్యాపిస్తాడు' అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ మూవీపై ఆసక్తిని కలిగిస్తోంది.
వాస్తవ సంఘటన ఆధారంగా ''విశ్వక్'' అనే సినిమా వస్తోంది. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, పెళ్లిచూపులు అభయ్ మరియు ప్రముఖ దర్శకుడు వీర శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ...
విశ్వక్ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. కొత్త తరహా కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని నమ్ముతున్నాను. హీరో అజయ్ కతుర్వర్, డైరెక్టర్ వేణు ముల్కల ఇతర నటీనటులకు టెక్నీషియన్స్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోందని ఆశిస్తున్నాను. ఇలాంటి సినిమాలకు అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.
డైరెక్టర్ వేణు ముల్కల మాట్లాడుతూ...
సొసైటీ మీద తీసిన ఈ సినిమా తప్పకుండా అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత తాటికొండ బాలకిషన్ గారికి ధన్యవాదాలు. విశ్వక్ టీమ్ బయటి దేశాల్లో ఉన్న ఎన్నారై లను ఉద్దేశిస్తూ టీజర్ లొ వాడిన మాటలు కథ పరంగా న్యాయబద్దంగా వస్తాయి. మన ఇంటి గజాన్ని వాడుకోవడాని ఇష్టపడకుండా కోర్టుల చుట్టూ తిరుగుతాము. కాశ్మీర్ లో భూభాగాన్ని ఎవరైనా తాకితే యుద్ధం చేస్తాము. అలాగే మానవ బలగమైన దేశ దేశాల్లో ఉన్న భారత సంతతిని ఎందుకు వదులుకోవడం ? అంటూ ఈ సినిమాలో హీరో పాత్రను డిజైన్ చేశాను. విశ్వక్ సినిమా టీజర్ బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఈ సినిమా చెయ్యడానికి సహకరించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
హీరో అజయ్ కతుర్వర్ మాట్లాడుతూ...
టీజర్ చూసి చాలా మందికి చాలా సందేహాలు వచ్చాయి. ఈ సినిమా ఎవ్వరినీ నొప్పించదు. తప్పకుండా అందరిని ఆలోచింపజేసే సినిమా ఆవుతుంది. ఒక సినిమలో నటించానన్న సంతృప్తి ఉంది. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిసత్తులో కూడా ఇలాంటి మరిన్ని కొత్త కాన్సెప్ట్స్ తో మీ ముందుకు వస్తాను ఇలాగే మీ అందరి ఆధరఅభిమానాలు కావాలని తెలిపారు.
నిర్మాత తాటికొండ బాలకిషన్ మాట్లాడుతూ...
సినిమా చేయాలన్న కోరిక విశ్వక్ మూవీతో తీరింది. దర్శకుడు వేణు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ మూవీ ఉండబోతోంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. త్వరలో విడుదల కానున్న సినిమా కూడా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
హీరో: అజయ్ కతుర్వర్
హీరోయిన్: డింపుల్
బ్యానర్: గోల్డెన్ డక్ ప్రొడక్షన్
నిర్మాత: తాటికొండ బాలకిషన్
డైరెక్టర్: వేణు ముక్కల
సంగీతం: సత్య సాగర్ పొలం
కెమెరామెన్: ప్రవీణ్ దేవ్
ఎడిటర్: కె.విశ్వనాథ్
లిరిక్స్: రామ్ ప్రసాద్ రావు
పిఆరోఒ: వంశీ శేఖర్
లైన్ ప్రొడ్యూసర్: ఎమ్.ఉదయ భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ జలగం
ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.