Categories: General

Vidyarthi movie teaser getting awesome responce

'రాజుగారి గ‌ది' ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'విద్యార్థి'. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాయి కొర్రపాటి, కేఎల్.దామోదర్ ప్రసాద్ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. కంచెలు, కట్టుబాట్లు మంచి చెడులు మధ్య ఉండాలి, మనుషుల మధ్య కాదు అంటూ టిఎన్ఆర్ చెప్పిన డైలాగ్ కు గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ...
హీరో చేతన్ చీను & హీరోయిన్ బన్నీ వాక్స్ ఈ సినిమాతో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుంటారు, "మీకు జాతీయ గీతం మీద గౌరవం ఉందా ? మరి అంత గౌరవం ఉన్న మీకు మా జాతి అంటే ఎందుకు సార్ అంత కోపం" డైలాగ్ ఆలోచింపజేసే విధంగా ఉంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు తెలువుతామని అన్నారు.

నిర్మాత ఆళ్ల వెంకట్ మాట్లాడుతూ...
సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది, డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది, మా సినిమాకు పని చేసిన అందరూ టెక్నీషయన్స్, ఆర్టిస్ట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మధు మదసు దర్శకత్వం, బల్గానిన్ సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయని తెలిపారు.
తారాగ‌ణం:
చేత‌న్ చీను, బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి), ర‌ఘుబాబు, మ‌ణిచంద‌న‌, జీవా, టీఎన్ఆర్‌, న‌వీన్ నేని, య‌డం రాజు, నాగ‌మ‌హేష్‌, ప‌వ‌న్ సురేష్‌, శ‌ర‌ణ్ అడ్డాల‌.

సాంకేతిక బృందం:
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, సురేష్ బ‌నిశెట్టి, వాసు వ‌ల‌బోజు
సినిమాటోగ్ర‌ఫీ: కన్న‌య్య సిహెచ్‌.
ఎడిటింగ్‌: బొంతల నాగేశ్వ‌ర‌రెడ్డి
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌
కొరియోగ్ర‌ఫీ: అనీష్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వ‌ంశీ తాడికొండ‌
స‌హ నిర్మాత‌: రామ‌కృష్ణ రేజేటి (ఆర్‌.ఆర్‌.కె.)
నిర్మాత‌: ఆళ్ల వెంక‌ట్ (ఏవీ)
ద‌ర్శ‌క‌త్వం: మ‌ధు మాదాసు
బ్యాన‌ర్‌: మ‌హాస్ క్రియేష‌న్స్‌

Facebook Comments

About SR

Share

This website uses cookies.