RGV Murder Movie Stills And Trailer Released

ఆర్జీవీ సినిమా మర్డర్ ట్రైలర్ కు విశేష స్పందన

ట్రెండ్ సెట్టర్ చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు విభిన్న కథలతో సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సంచలన సామాజిక యదార్ధ ఘటనలతో పాటు పలు బయోపిక్ చిత్రాలను తీస్తూ తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్న ఆయన తాజాగా తీసిన 'మర్డర్' (కుటుంబ కథా చిత్రం) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను మంగళవారం ఉదయం విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్ది సమయానికే విశేష ఆదరణకు నోచుకోవడం ఓ విశేషం. ఆ మధ్య జరిగిన ఒక సంచలన యదార్ధ ప్రేమ హత్య ఉదంతాన్ని ఆధారం చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు.

శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఎవరినీ కించపరచాలని ఈ చిత్రాన్ని తీయలేదని, భావ స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని యదార్ధ ఘటనతో వర్మ రూపొందించడం జరిగిందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు.

దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం.

ఆగస్ట్ నాటికి సినిమా తొలికాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్ కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు.

ఈ చిత్రానికి డిఓపి: జగదీష్, సంగీతం: డిఎస్ఆర్.

RGV Murder Movie Stills And Trailer Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%