Manam Saitham’s Kadambari Kiran Receives Honorary Doctorate

Manam Saitham’s Kadambari Kiran Receives Honorary Doctorate (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

'మనం సైతం' కాదంబరి
కీర్తి కిరీటంలో గౌరవ డాక్టరేట్!
'కంగ్రాట్స్ కాదంబరి' అంటూ
ప్రముఖుల ప్రశంసల వెల్లువ!!

'మనం సైతం' అంటూ నిర్విరామంగా సేవాయజ్ఞం నిర్వహిస్తున్న 'కాదంబరి కిరణ్' కీర్తి కిరీటంలో గౌరవ డాక్టరేట్ చేరింది. 'మనం సైతం' వ్యవస్థాపకుడిగా... కాదంబరి అందిస్తున్న అద్వితీయ సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ పీస్ యూనివర్సిటీ' వారు 'గౌరవ డాక్టరేట్' ప్రకటించారు.

పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... విలక్షణ నటుడిగా పేరు గడించిన కాదంబరి 'మనం సైతం' పేరుతో స్వచ్చంద సంస్థకు శ్రీకారం చుట్టి... నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతున్నాయి.

కాదంబరికి 'గౌరవ డాక్టరేట్' ప్రకటన పట్ల పలువురు సినీ ప్రముఖులతోపాటు... రాజ్యసభ సభ్యులు-ప్రముఖ తెరాస యువనేత జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి కృతజ్ఞతలు తెలిపిన కాదంబరి... ఈ డాక్టరేట్ తో తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానని అన్నారు. డాక్టరేట్ ప్రదానకార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నామని 'గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ' ప్రతినిధి తెలిపారు!!

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%