Actress Pranavi Manukonda Takes Part In Green India Challenge

Actress Pranavi Manukonda Takes Part In Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన వర్థమాన నటి ప్రణవి మానుకోండ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన వర్థమాన నటి ప్రణవి మానుకోండ.

ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ మనమందరం గాలి పీల్చుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా మరో ముగ్గురు లక్ష్మీ , సింధు , విష్ణు ప్రియ లకు ఛాలెంజ్ విసురుతున్నానని వారు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని తెలుపుతున్నానని నటి ప్రణవి మానుకొండ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Facebook Comments
Share