Anchor Udaya Bhanu Stills Taking The Green India Challenge

Anchor Udaya Bhanu Stills Taking The Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anchor Udaya Bhanu Stills Taking The Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anchor Udaya Bhanu Stills Taking The Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anchor Udaya Bhanu Stills Taking The Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ ఉదయభాను గారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కు నందు మూడు మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను గారు.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ మొక్కలను నాటి పెంచడం మనందరి కర్తవ్యం అని మన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉండగలము. ఒక వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాము కరోనా లాంటి వివిధ రకాల వైరస్ ల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాము ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం కాబట్టి ముందు తరాల వారికి మంచి వాతావరణం అందించడం మా అందరి బాధ్యత. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం అని. ఇది ఎంతో అందమైన చాలెంజ్ మొక్కలు నాటాలని చాలెంజ్ తో ప్రజల్లోకి తీసుకు రావడం గొప్ప విషయం నేను విన్నాను ఒక్క మొక్క తో మొదలు పెట్టి ఈరోజు కోట్లాది మొక్కలను దేశవ్యాప్తంగా నాటించడం జరిగిందని ఒకప్పుడు మొక్కలు పెట్టండి పెట్టండి అని ప్రజలను బ్రతిమిలాడెది కాని ఇప్పుడు మాకు మొక్కలు ఇవ్వండి ఇవ్వండి అనే చైతన్య వచ్చిందన్నారు. నా చిన్నతనంలో ఈ ప్రాంతంలో సర్కారు తుమ్ములు కనిపించేవి ఇప్పుడు మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది.

ఇది గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నినాదం పట్టుదల వల్లనే సహకారం అయినాది.దినిని స్పూర్తిగా తీసుకొని సంతోష్ గారు కీసరగుట్ట పరిధిలో అడవి దత్తత తీసుకున్న అభివృద్ధి చేస్తున్నారు. నాకు కూడా పకృతి అంటే చాలా ఇష్టం అందుకోసమే నా ఇద్దరు కూతుళ్లకు భూమి మరియు ఆ ఆరాధ్య అని పేర్లు పెట్టుకున్నాను. మీరందరూ కూడా చేతనైనంత వరకు చెట్లను పెంచండి. ఇప్పటికే మనం తాగే నీటిని కోనుకుంటున్నాం కొన్ని రోజులు అయితే ఆక్సిజన్ సిలిండర్ కోనుకోవలసి వస్తుంది. ఈ సందర్భంగా నీను మరోక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నాను 1) ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ 2) director సంపత్ నంది 3) ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ఈ ముగ్గురు కూడా నా చాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%