Megastar Chiranjeevi And Trivikram Movie Still On Cards

మెగాస్టార్ తో సినిమా ఉంటుందట !

త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నారు. వారి డ్రీమ్ కాంబినేషన్స్ లో ఈ కాంబినేషన్ కూడా ఒకటి. పైగా ఈ కాంబినేషన్ అంటే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. కాగా ఆ కోరిక భవిష్యత్తులో తీరేలా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత, త్రివిక్రమ్ మెగాస్టార్ తో సినిమా చేస్తాడని ఇప్పటికే త్రివిక్రమ్ చిరుకు ఒక లైన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే త్రివిక్రమ్ ఈ సినిమాని ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ లా చేస్తాడట. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ గా అనిపిస్తోంది.

ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తారక్ సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Megastar Chiranjeevi And Trivikram Movie Still On Cards (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.