MAD Movie First Look Released

‘'మ్యాడ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది.

మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు.

ఈ సంద‌ర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. 8వ తేది రిలీజ్ చేసిన ఫ్రీ లుక్ కి చాలా మంచి రెస్పాన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న కొన్ని జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, లివింగ్ రిలేషన్ లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే మోడరన్ జంటల లైఫ్ స్టైల్ ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

హీరో, హీరోయిన్లు వారి వారి పాత్ర‌ల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా న‌టించారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగా ఆక‌ట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తుంది.ఈ చిత్రం కాన్సెప్ట్ గురించి తెలుసుకుని, పాటలు విన్న వెంటనే 'మధుర' ఆడియో వారు తాము రిలీజ్ చేస్తామని ముందుకు రావడంతో ఈ నెల 14వ తేది ఫస్ట్ సింగల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన 'మ్యాడ్' ఈతరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము.

న‌టీన‌టులు.. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ , త‌దిత‌రులు న‌టించ‌గా..
బ్యాన‌ర్‌ : మోదెల టాకీస్
ప్రోడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు
కెమెరా : రఘు మందాటి
ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : మోహిత్ రెహ్మానియాక్
లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్
పి ఆర్ ఒ : జియస్ కె మీడియా

MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAD Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%