Categories: PoliticsTeluguVideos

Heart Break for Residents of Vizag’s RR Venkatapuram | Turns into Protest Against LG Polymers (Video)

         Heart Break for Several Residents of Vizag's RR Venkatapuram | Turns into Protest Against LG Polymers | Special Story

#IdiSangathi
#EtvAndhraPradesh

() అర్థరాత్రి ఎల్‌జీ పాలిమర్‌ నుంచి వెలువడిన విషవాయువు.. సమీప గ్రామస్ధుల పాలిట కాళ రాత్రిగా మారింది. ఆ విషాదం నుంచి కోలుకునే అవకాశం లేకుండా రెండోరోజు రాత్రి సైతం విషం చిమ్ముతూ.. స్థానికులను చీకట్లో పరుగులు పెట్టించింది. దిక్కుతోచక కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిలబడేలా చేసింది. పేలుడు వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే వదంతలు...విశాఖ వాసులకు మూడోరోజు కూడా నిద్ర లేకుండా చేశాయి. ఇటు ఇంటికి రాలేక...కరోనా వల్ల అటు ఆత్మీయుల చెంతకు వెళ్లలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

() ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చింది. భోపాల్ గ్యాస్ తరహాలోనే నిద్రలో ఉండగా గ్యాస్ లీకై 12 మంది ప్రాణాల్ని తీసింది. వందలమంది ఊపిరి తీసుకునేందుకు పరుగులు తీసేలా చేసింది. ఆస్పత్రుల పాల్జేసింది. స్థానికుల బ్రతుకును ఛిద్రం చేసి.. ఆ ప్రాంతంలో నివసించగలమా అన్న సందేహాలనూ రేకెత్తించింది. రాష్ట్రప్రభుత్వం .. మృతుల కుటుంబాలకు కోటి రూపాoయలు... గ్యాస్ కారణంగా ఇబ్బందులకు గురై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఐతే.. స్థానిక ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల భద్రత, పర్యవారణానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం.. సదరు సంస్థ... చెల్లించే మొత్తాలు ఏ మూలకన్నది ఇప్పుడు ప్రశ్న. నిబంధనలు పట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్వహరించిన కంపెనీలు భారీమొత్తంలో పరిహారం చెల్లించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.

 

‍‌() యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి.. నిర్లక్ష్యమే విశాఖలో పెను ప్రమాదానికి కారణమైందంటున్నారు JNTU సంచాలకులు ఆచార్య లక్ష్మణ్ రావు. ఈ ప్రమాదంలోంచి అన్ని పరిశ్రమలు పాఠాలు నేర్చుకోవాలని, వాటిని పర్యవేక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలికి ఇది మేలుకోలుపని అన్నారు. లాక్‌డౌన్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పటం సరికాదని తెలిపరు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాలను ప్రభావితం చేసే పరిశ్రమలు, కర్మాగారాలకు లక్ష్మణ్ రావు కీలక సూచనలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ విషాదం- ప్రమాదం పర్యవసానాలపై ఆయన అనేక అంశాలు ETVతో పంచుకున్నారు

Facebook Comments
Heart Break for Residents of Vizag's RR Venkatapuram | Turns into Protest Against LG Polymers (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share