Blessing in Disguise | CoronaVirus Rising Humanity in Several People | Forcing them to Lend Helping Hand
మానవత్వం.. ఇది ఎవరోచెబితే అలవడేది కాదు. మార్కెట్లో కొనుగోలు చేస్తే దొరికే వస్తువూ కాదు. ఎదుటి వ్యక్తి కష్టంతో విలవిల్లాడుతుంటే... తనకెందుకులే అని వెళ్లిపోకుండా సాయంతో వెన్నుతట్టి .. ఓదార్చేదే మానవత్వం. ఆకలితో అలమటించే అభాగ్యులకు బుక్కెడు బువ్వ పెట్టి అండగా నిలిచేది మానవత్వం. దానికి ప్రాంతంతో సంబంధం లేదు. డబ్బులతో పేచి ఉండదు. ఆదుకునే మనసుండాలి అంతే. కష్టకాలంలో ఆదుకుంటే ఆ సాయానికి విలువ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం కరోనాతో ప్రపంచమే కకావిలకమవుతోంది. బతుకు దుర్భరమై, కష్టాల కోరల్లో చిక్కుకుని, ఆకలితో అలమటిస్తున్న అన్నార్థుల గోడు ఓ వైపు. అయ్యో పాపం అంటూ అండగా నిలుస్తున్న మానవతావాదుల ఓదార్పు మరోవైపు . జీవితమే ప్రశ్నార్థకమవుతున్న వేళ మానవత్వం పరమళింపజేస్తున్న మంచిమనుషులు .. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
#IdiSangathi
#EtvAndhraPradesh
#CoronaVirus
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Blessing in Disguise | CoronaVirus Rising Humanity in Several People | Forcing them to Lend Helping Hand మానవత్వం.. ఇది ఎవరోచెబితే అలవడేది కాదు. మార్కెట్లో కొనుగోలు చేస్తే దొరికే వస్తువూ కాదు. ఎదుటి వ్యక్తి కష్టంతో విలవిల్లాడుతుంటే... తనకెందుకులే అని వెళ్లిపోకుండా సాయంతో వెన్నుతట్టి .. ఓదార్చేదే మానవత్వం. ఆకలితో అలమటించే అభాగ్యులకు బుక్కెడు బువ్వ పెట్టి అండగా నిలిచేది మానవత్వం. దానికి ప్రాంతంతో సంబంధం లేదు. డబ్బులతో పేచి ఉండదు. ఆదుకునే మనసుండాలి అంతే. కష్టకాలంలో ఆదుకుంటే ఆ సాయానికి విలువ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం కరోనాతో ప్రపంచమే కకావిలకమవుతోంది. బతుకు దుర్భరమై, కష్టాల కోరల్లో చిక్కుకుని, ఆకలితో అలమటిస్తున్న అన్నార్థుల గోడు ఓ వైపు. అయ్యో పాపం అంటూ అండగా నిలుస్తున్న మానవతావాదుల ఓదార్పు మరోవైపు . జీవితమే ప్రశ్నార్థకమవుతున్న వేళ మానవత్వం పరమళింపజేస్తున్న మంచిమనుషులు .. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. #IdiSangathi #EtvAndhraPradesh #CoronaVirus
This website uses cookies.