MAA Artists Donates To Help Workers Without A Union Card

కార్డ్ లేని అసిస్టెంట్ల‌కు మా ఆర్టిస్టుల‌ డొనేష‌న్స్

టాలీవుడ్ లో నిత్యావ‌స‌రాల సాయం గురించి తెలిసిందే. అవ‌స‌రార్థులైన 24 శాఖ‌ల కార్మికుల‌కు ఈ సాయం అందుతోంది. అయితే ఏ శాఖ‌కు చెంద‌కుండా యూనియ‌న్ కార్డ్ లేకుండా పొట్ట పోషించుకోవ‌డానికి వ‌చ్చిన కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఎలా? అన‌ధికారికంగా ఇలాంటి వాళ్లు వేల‌ల్లో ఉన్నారు. అందుకే అలా కార్డ్ లేకుండా క‌ష్టాల్ని ఎదురీదుతున్న పేదల్లో కార్డ్ లేని వారికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు మూవీ ఆర్టిస్టుల సంఘం ఆర్టిస్టులు. మా స‌భ్యుల్లో హేమ‌, సురేఖా వాణి, రజిత, జయలక్ష్మి, సనా, ప్రవీణ,, హిమజ, మాధవి, మా మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వెంకట గోవిందరావు, ఇంకా హేమ కూతురు ఈషా, సురేఖవాణి కూతురు సుప్రీత, జయలక్ష్మి కూతురు శృతి త‌దిత‌రులు కార్డ్ లేని అసిస్టెంట్ల‌కు డొనేష‌న్లు అందించారు.

ఈ సంద‌ర్భంగా హేమ మాట్లాడుతూ... కార్డ్ లేని అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాయం చేస్తున్నాం. సెట్లో మ‌మ్మ‌ల్ని బాగా చూసుకునేది అసిస్టెంట్లే. కొంద‌రు డొనేష‌న్లు ఇచ్చిన మ‌హిళా ఆర్టిస్టులు రాలేక‌పోయారు. వారికి ధ‌న్య‌వాదాలు అన్నారు. సురేఖా వాణి మాట్లాడుతూ.. అంద‌రూ నిత్యావ‌స‌రాలు పంచుతున్నారు. అవే కాకుండా ఇంట్లో ఇంకా అవ‌సారాలుంటాయి. గ్యాస్ .. పాలు స‌హా ఇంకా అర్జెంట్ నీడ్స్. అందుకే వారికి డ‌బ్బును సాయం చేస్తున్నాం అని తెలిపారు. రజిత మాట్లాడుతూ ఈ కరోనా కారణంగా చాలామంది ఇబ్బంది గురవుతున్నారు అసోసియేషన్ లో ఉన్న కొంత మంది కార్మికులకి సహాయం అందుతుంది కార్డు లేని వారికి సాయం చేయాలని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు ఇవ్వడం జరిగింది" అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఆర్టిస్టులు పాల్గొన్నారు.

MAA Artists Donates To Help Workers Without A Union Card (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAA Artists Donates To Help Workers Without A Union Card (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
MAA Artists Donates To Help Workers Without A Union Card (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%