'మనం సైతం' సేవాయజ్ఞంలో 'మూడు వేల' మైలు రాయి!!!
కరోనా కట్టడి కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో నిస్సహాయులైపోయిన పేదలకు సహాయసహకారాలందించడంలో "మనం సైతం" అందరికంటే ముందుగా స్పందించిన సంగతి విదితమే!
"మనం సైతం" నిత్యావసర వస్తువుల రూపంలో సేవలు అందించిన సినీ కార్మికుల/పేదల సంఖ్య నేటికి (25-4-2020) '3000' కి చేరువ కావటం గర్వించదగిన విషయం! ఈ సందర్భంగా సేవలు అందుకున్న పేదలు మనసారా దీవిస్తుండగా.. పెద్దలు వెన్నుదన్నుగా నిలవడం .."మనం సైతం"సేవలను మరింత విస్తృతం చేయడానికి ధైర్యాన్నిచ్చింది! అందరి మద్దతుతో నిరంతరం నలుచెరగులా.. తమ సేవలను కొనసాగిస్తూనే ఉంటామని
"మనం సైతం" వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు!!
This website uses cookies.