Rajanala Naga Lakshmi Happy With Mega Couple Checking On Her Health

ఈ జ‌న్మ‌కిది ఇది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి అనే ఆమెకు స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్ వారు ఆమెను ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి శ్రీమతి సురేఖ స్వయంగా నాగలక్ష్మి వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు ఆరోగ్యంగా ఉన్నార‌ని..ఏం కాద‌ని మీకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ` ఇది క‌లా..నిజ‌మా? నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌మ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌ధులిచ్చారు.

 

Rajanala Naga Lakshmi Happy With Mega Couple Checking On Her Health (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share