ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఆర్థిక సహాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస్ !!!
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. దీనితో చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి రూ 10,11,111 విరాళం అందించారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం ఈ మొత్తం ఉపయోగించాలని కోరారు. అవసరమైతే మరోసారి కూడా తాను సాయం చేస్తానని తెలిపారు. నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ ఈ డబ్బును నిర్మాతలు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్లకు అందజేశారు.
This website uses cookies.