Ravi Teja Donates 20 Lakhs Towards The Corona Crisis Charity Initiative

సినీ కార్మికుల కోసం రూ. 20 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో ర‌వితేజ‌

క‌రోనా వ్యాప్తి భ‌యం కార‌ణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవ‌డంలో భాగంగా హీరో ర‌వితేజ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. త‌న వంతుగా ఈ మొత్తాన్ని క‌రోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న తెలిపారు.

ఇవ్వ‌డ‌మ‌నే విష‌యం వ‌చ్చేదాకా తీసుకోవ‌డ‌మ‌నే ప్ర‌యోజ‌నం ఎప్ప‌టికీ పూర్తికాద‌నీ తెలిపిన ర‌వితేజ‌.. ఇది బాధ‌ను కొల‌వ‌డం కాదు, సినీ కార్మికుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో తోడ్పాటు మాత్ర‌మే అని పేర్కొన్నారు. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి అంద‌రూ ఇంటిప‌ట్టునే సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

Ravi Teja Donates 20 Lakhs Towards The Corona Crisis Charity Initiative (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.