వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న జీఏ 2, 18 పేజస్ చిత్ర బృందం - వీడియో కాల్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్స్
GA2 and 18 Pages Team is doing music sittings via video conference (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
దర్శకుడు సూర్య ప్రతాప్ మాట్లాడుతూ
కరోనా నివారణకు ప్రజలంతా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటమే ఏకైక మార్గం అని, ఈ ఫ్రీ టైమ్ లో వివిధ రకలా సోషల్ మీడియా యాప్స్ ద్వారా పెండింగ్స్ వర్క్స్, ఫ్యూచర్ లో చేయాల్సిన పనులు గురించి కార్యాచరణ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలానే ఈ విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా మనందరి కోసం కష్టపడుతున్న ఎందరో పోలీస్ అధికారులకి, డాక్టర్లకి కృతజ్ఞతలు తెలుతున్నాను అని అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ
కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా అభినందనీయం. మన కోసం ఈ కష్ట కాలంలో తోడుగా నిలిచిన డాక్టర్లకి, పోలీస్ వారికి కృతజ్ఞతలు. 21 రోజులు లాక్ డౌన్ కి నా సంపూర్ణ మద్దత్తు ఇస్తేనే ఈ ఫ్రీ టైమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ 18 పేజీస్ కి అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ కోసం గతంలో నేను బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గీతగోవిందం పాటలకి మించి ఉండేలా 18 పేజీస్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను అని అన్నారు.
సాంకేతిక నిపుణులు
సమర్పణ - అల్లు అరవింద్
నిర్మాత - బన్ని వాసు
సంగీత దర్శకుడు - గోపి సుందర్
దర్శకుడు - పల్నాటి సూర్య ప్రతాప్
This website uses cookies.