Anchor Ravi Thota Bavi Movie Teaser Launched By N Shankar

యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న‌`తోట‌బావి` టీజ‌ర్ ని విడుద‌ల చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్.

యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్ గా గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం తోట‌బావి. దౌలు(విష్ణుప్రియహోట‌ల్), చిన్న స్వామి, అభినేష్. బి స‌హ‌నిర్మాత‌లు. ఇటీవల విడుదలైన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా

ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - "టీజర్ చాలా బాగుంది. దర్శకుడు మంచి విజన్ తో తెరకెక్కించాడు అని తెలుస్తోంది. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రవిని చాలా కాలంగా టెలివిజన్ లో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఆయన హీరోగా చేస్తున్న చిత్రం తోట‌బావి. టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుకరావాల‌ని కోరుకుంటున్నా. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్' అన్నారు.

ద‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ...నా సినిమా టీజర్ ను దర్శకుడు ఎన్. శంకర్ గారు విదలచేయడం హ్యాపీగా ఉంది. హీరో ర‌విగారు ఇచ్చిన స‌పోర్ట్ తో సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాకు ఏం కావాలో అన్ని సమకూర్చి నాకు స‌హ‌క‌రించారు. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.

నిర్మాత ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ మాట్లాడుతూ..మా సినిమా టీజర్ విడుదల చేసిన దర్శకుడు ఎన్. శంకర్ గారికి హృదయపూర్వక దన్యవాదాలు. మా మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాకి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్ తో మా ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాలు చాలా ఇంట్ర‌స్టింగ్ గా త‌యారు చేశారు. మొదటి సినిమా అయినా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా చక్కగా తెర‌కెక్కించారు. మా హీరో ర‌వి గారి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. సినిమా మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

ర‌వి, గౌత‌మి, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్, న‌ర్సింహా రెడ్డి, జ‌బర్ద‌స్త్ అప్పారావు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, రోహిణి, ఉన్నికృష్ణ‌, అభి, శివం త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: చిడ‌త‌ల న‌వీన్‌; ఎడిట‌ర్: గిరి, స‌ంగీతం: దిలీప్ బండారి, స‌్టంట్స్: శంక‌ర్‌, కొరియోగ్ర‌ఫీ: స‌న్ని, లిరిక్స్: రామాంజ‌నేయులు, స్టిల్స్: పాండు రంగ‌, స‌హ‌నిర్మాత‌లు: దౌలు (విష్ణుప్రియ హోట‌ల్), చిన్న స్వామి, అభినేష్ .బి, నిర్మాత: ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్, క‌థ‌-స్క్రీన్ ప్లే -మాటలు-ద‌ర్శ‌క‌త్వం: అంజి దేవండ్ల‌.

Anchor Ravi Thota Bavi Movie Teaser Launched By N Shankar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%