Categories: PoliticsTeluguVideos

Paddy Woes Continue | to Haunt Farmers of Nellore District (Video)

         అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది నెల్లూరు జిల్లా రైతుల పరిస్థితి. వర్షాలు అనుకూలించడంతో ధాన్యం సాగు పెంచారు ఇక్కడి రైతులు. తీరా పంటలు వేసేసరికి వర్షాలు ఎక్కువై దిగుబడిపై ప్రభావం చూపించింది. ఇక అన్ని అడ్డంకులు దాటుకొని అమ్ముకుందామని  వస్తే  కొనేవారు కరువయ్యారు. ఎన్ని మార్చినా ధాన్యం తేమశాతం నిబంధనలో మార్పు రాక పోవడం రైతులు ధాన్యం అమ్మకాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఎప్పటి మాదిరిగా మళ్లీ దళారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడి రైతులది.

కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపం.. నెల్లూరు జిల్లా రైతులకు శాపంగా మారింది. ఎంతో వ్యయప్రయాసల కోర్చి తీరా ధాన్యాన్ని కేంద్రాలకు చేర్చిన తర్వాత అక్కడ వారిని సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల మద్య దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు అన్నదాతలు. రైతుల నిస్సహయ స్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు దళారులు, వ్యాపారులు.
#IdiSangathi

Facebook Comments
Paddy Woes Continue | to Haunt Farmers of Nellore District (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share