Categories: General Telugu

Degree college movie to hit the theaters on Feb 7th

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం తదితర చిత్రాలు అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు దర్శకుడిగా నరసింహ నందికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. .ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం రెండు ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ మాదిరి సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Facebook Comments

About SR

Share

This website uses cookies.

%%footer%%