Sharwanand And Samantha’s Jaanu Movie First Look Released

శ‌ర్వానంద్‌, స‌మంత చిత్రం `జాను`.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రానికి జాను అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 96 సినిమాకు ఇది రీమేక్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం రోజున ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా...
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - శ‌ర్వానంద్‌, స‌మంత కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రానికి `జాను` టైటిల్‌ను ఖ‌రారు చేశాం. బ్యూటీఫుల్ అండ్ హార్ట్ ట‌చింగ్ ల‌వ్‌స్టోరి ఇది. షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ సినిమాను బ్యూటీపుల్‌గా తెర‌కెక్కించారు. శ‌ర్వానంద్‌, స‌మంత పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. గోవింద్ వ‌సంత సంగీతం, మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లంగా ఉంటాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం అన్నారు.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి

Sharwanand And Samantha’s Jaanu Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Sharwanand And Samantha’s Jaanu Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Sharwanand And Samantha’s Jaanu Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%